ఐటం... ఎక్స్ ఫోజింగ్ చేస్తూ రెచ్చిపోతున్న అర్చన
హైదరాబాద్: అల్లరి నరేష్ హీరోగా రూపొందిన 'నేను' చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ అర్చనకు ఆ తర్వాత హీరోయిన్‌గా చేసిన సినిమాలేవీ ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. దీంతో చిన్న సినిమాల్లో తప్ప స్టార్ హీరోలతో చేసే అవకాశం దక్కించుకోలేక పోయింది. ఆ తర్వాత ఆ అవకాశాలు కూడా తగ్గడంతో పలు పెద్ద సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ బండి లాగిస్తోంది.
తాజాగా అర్చన హాట్ అండ్ సెక్సీగా ఎక్స్ ఫోజింగ్ చేస్తూ ఐటం సాంగులు చేయడానికి సిద్ధమైంది. ప్రస్తుతం తమిళంలో 'కరుప్పం పట్టి' అనే చిత్రంలో ఐటం సాంగు చేస్తోంది. ఎప్పుడూ లేని విధంగా ఆమె ఈ ఐటం సాంగులో హాట్ హాట్ భంగిమలతో ప్రేక్షకులను ఎంకరేజ్ చేయబోతోంది.
ఈ చిత్రంలో ఆమె చేస్తున్న స్పెషల్ సాంగును కన్నన్ కంపోజ్ చేస్తున్నారు. ఇందులో ఆమె తమిళ నటుడు అజ్మల్‌తో కలిసి ఈ పాటలో నటిస్తోంది. ఈ చిత్రంలో అజ్మల్ హీరోగా డ్యూయల్ రోల్ చేస్తున్నారు. అపర్ణ బాజ్ పాయ్, ఆలిస్ హీరోయిన్లుగా చేస్తున్నారు. అజ్మల్ 'రంగం' చిత్రంలో విలన్ పాత్ర చేయడంతో పాటు, రామ్ చరణ్ రచ్చ సినిమాలో కూడా నటించిన విషయం తెలిసిందే.
అజ్మల్, అర్చన కలిసి చేసిన ఈ హాట్ ఐటం సాంగులోని స్టెప్పులపై ఓలుక్కేస్తూ, మరిన్ని వివరాలు స్లైడ్ షోలో తెలుసుకుందాం...

ఈ చిత్రానికి సుందర్ కె నిర్మాత. ప్రభురాజు చోళన్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఓ న్యూస్ పేపర్ ఆర్టికల్ ను బేస్ చేసుకుని ఈచిత్రాన్ని రూపొందిస్తున్నారు.

ఒక ఫారినర్ ఇండియాకు తిరిగి వచ్చిన తన కుటుంబ మూలాలు తెలుసుకున్నాడు. ఈ విషయంలో దిపత్రికల్లో ప్రచురితం అయింది. దీని ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.

ఈ చిత్రంలో హీరో ఫ్రాన్స్ దేశస్తుడిగా నటిస్తున్నాడు. అతడు తిరిగి ఇండియా వచ్చి కరుప్పం పట్టి అనే గ్రామానికి తిరిగి వచ్చి తన కుటుంబ మూలాలు తెలుసుకుంటారు.

రియల్ స్టోరీకి కమర్షియల్ అంశాలను జోడించి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


Click it and Unblock the Notifications











