పవన్ 'షాడో'కి పవర్ ఫుల్ డైలాగ్స్ తో వేదం డైరెక్టర్....!

By Sindhu

పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న'ది షాడో" చిత్రానికి ప్రముఖ దర్శకుడు క్రిష్ మాటలు వ్రాస్తున్నారట. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఫిలింస్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, 2007 ఫార్మర్ మిస్ ఇండియా సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, కోలీవుడ్ డైరెక్టర్ విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'ది షాడో".

ఈ చిత్రానికి ముందుగా ప్రముఖ సినీ రచయిత అబ్బూరి రవి సంభాషణలు వ్రాస్తారని తెలిసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. పవన్ కళ్యాణ్ రీసెంట్ చిత్రం 'తీన్ మార్" సక్సెస్ కి కారకుడైన త్రివిక్రమ్ డైలాగ్స్ తో 'తీన్ బార్"తలపిస్తోంది. సో అదే ట్రెండ్ ఫాలో అయిపోతూ అబ్బూరి రవి స్థానంలో దర్శకుడు క్రిష్ (జాగర్లమూడి రాధాకృష్ణ) ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న'ది షాడో" చిత్రానికి మాటలను వ్రాయనున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం.

క్రిష్ గతంలో తన దర్శకత్వంలో వచ్చిన 'గమ్యం", 'వేదం" చిత్రానికి చాలా పవర్ ఫూల్ డైలాగులు వ్రాసిన సంగతి మనకు తెలిసిందే. మరి క్రిష్ ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న'ది షాడో" చిత్రానికి ఇంకా ఎంతటి శక్తివంతమైన మాటలు వ్రాస్తారో వేచి చూడాలి. ఈ పవన్ కళ్యాణ్ హీరోగా నటించనున్న'ది షాడో" చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సారాజేన్ 2007 ఫెమీనా మిస్ ఇండియాగా ఎన్నికైంది. ఆ తర్వాత ఆమె 'గేమ్" అనే బాలీవుడ్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X