అల్లు అర్జున్ 'వేదం' లో బాంబు దాడులతో యాంటీ క్లైమాక్స్?
అల్లు అర్జున్, మంచు మనోజ్, అనుష్క ప్రధాన పాత్రల్లో రూపొందిన 'వేదం' చిత్రం యాంటీ క్లైమాక్స్ తో తీసారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడుతోంది. క్లైమాక్స్ మొత్తం బాంబు ప్రేలుళ్ళ నేపధ్యంలో జరుగుతుందని సమాచారం. ముంబయి బాంబు ప్రేలుళ్ళను బేస్ చేసుకుని ఈ క్లైమాక్స్ ప్లాన్ చేసారని చెప్పుకుంటున్నారు. ఓ హాస్పటల్ ని తీవ్రవాదులు చుట్టుముట్టగా ఈ క్లైమాక్స్ వస్తుందని, అక్కడికి ఆ సమయానికి మెయిన్ క్యారెక్టర్లైన అల్లు అర్జున్,మనోజ్, అనుష్క, మనోజ్ బాజపాయి, మరో ఇద్దరు చేరుకుంటారని చెప్తున్నారు.
అల్లు అర్జున్, మనోజ్ అక్కడ టెర్రరిస్టులతో పోరాడి హాస్పటల్ లోని పేషెంట్స్ ని రక్షించేసి తాము మాత్రం ప్రాణాపాయ స్దితిలో పడతారని చెప్తున్నారు. అయితే మొదటి అనుకున్న క్లైమాక్స్ లో రాఘవేంద్రరావు గారి సూచనల మేరకు కొద్ది మార్పులు చేసారని కూడా తెలుస్తోంది. యాంటి క్లైమాక్స్ అప్పుడు బాబీ చిత్రాన్ని దెబ్బ కొట్టిందని కాబట్టి జాగ్రత్తపడమని క్రిష్ ని హెచ్చరించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమే అయితే క్లైమాక్స్ దాదాపు ఇరవై నిముషాల పైగా బాంబు ప్రేలుళ్ళతో ఉండే హంగామా చూడాల్సి వస్తుంది. క్రిష్ గత చిత్రం గమ్యం లో కూడా నక్సలైట్ల దాడులతో క్లైమాక్స్ చేసారు. అందులో అల్లరి నరేష్ క్యారెక్టర్ ని లేపేసారు.


Click it and Unblock the Notifications











