ఒక్క సినిమాకే ముదిరిపోయిన 'వేదం' హీరోయిన్
వేదం చిత్రంలో అల్లు అర్జున్ లవర్ లా డబ్బున్న అమ్మాయిగా చేసిన దీక్షాసేధ్ చేసింది ఒక్క సినిమానే అయినా మాటలు మాత్రం ముదురు హీరోయిన్ గా ఉంటున్నాయి. కథ డిమాండ్ చేస్తే ముద్దు సీన్లకు, బికినీలకు కూడా నేను సిద్ధమే అంటూ చెప్పి అందరికీ ఒక్కసారి ఎట్రాక్ట్ చేసే ప్రయత్నం చేస్తోంది. ప్రస్తుతం రవితేజ సరసన 'మిరపకాయ్'లో నటిస్తోన్న ఈ ముద్దుగుమ్మ ఇక్కడ సెటలవ్వాలంటూ...తెలుగు నేర్చుకుంటున్నానంటోంది. ఆమె మాటల్లోనే..తెలుగు కాస్త అర్థమవుతోంది. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ నాతో తెలుగులోనే మాట్లాడాలని కండిషన్ పెట్టాను. అలా నాకు తెలుగు బాగా అలవాటవుతోంది. త్వరలో తెలుగులో డబ్బింగ్ చెప్పేస్తా అంటోంది. అలాగే వేదంలో పూజ పాత్ర నా నిజజీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. నాకు మోడలింగ్ అంటే ఇష్టం. అలా సినిమాల్లోకి వచ్చాను అని చెప్తోంది. ఇంతేగాక..దక్షిణాదిన అన్ని భాషలతోపాటు హిందీలోనూ మంచి అవకాశాలు వస్తే నటించాలన్నది నా కోరిక. నటిగా ఒక్క భాషకే పరిమితమై గిరిగీసుకుని కూర్చోవాలని లేదు అంటూ తమిళ నిర్మాతలను కూడా ఓ లుక్కయమంటోంది. అలా మొత్తానికి తనను తాను బాగానే ప్రమోట్ చేసుకుంటోందంటున్నారు.


Click it and Unblock the Notifications











