అమెరికాలో హయ్యస్ట్ గ్రాసర్ 'వేదం'
కళాకారునికి నిజమైన సంతోషాన్ని పంచేది ప్రేక్షకుల కరతాళ ధ్వనులే. ఆ సంతోషం నాకు 'వేదం' ద్వారా లభించింది. వేదం సినిమా పూర్తవ్వగానే థియేటర్‌లోని ప్రేక్షకులందరూ స్టాండింగ్ ఒవేషన్ లో నిలబడి చప్పట్లతో మా యూనిట్‌ని ఆశీర్వదిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా థియేటర్‌లలో పరిస్థితి ఇదే. అమెరికాలో సైతం ఈ సినిమా హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలుస్తోంది అంటూ చెప్పుకొచ్చారు క్రిష్. తన తాజా చిత్రం చిత్రం ప్రమోషన్లో భాగంగా కలిసిన మీడియాతో ఆయన మచ్చటిస్తూ ఈ విధంగా చెప్పుకొచ్చారు. అలాగే తాను డబ్బే ప్రధానంగా సినిమా చేయనని చెప్పారు. సామాజిక ప్రయోజనం కూడా అందులో ఉండాలనేది నా సిద్ధాంతం. అదే తొలి చిత్రానికీ, మలి చిత్రానికీ అవలంబించా. నాకు నేను ముందు కథకుడిగానే ఇష్టపడతా. కథను ప్రేక్షకులకు చెప్పడానికి నేను ఎన్నుకున్న మాధ్యమం సినిమా. ఎంతో నిశితంగా పరిశీలిస్తే కానీ మంచి కథలు రావు అన్నారు. ఇదే బాటలో ఆయన మరింత ముందుకెళ్ళాలని ధట్స్ తెలుగు కోరుకుంటోంది.


Click it and Unblock the Notifications











