అల్లు అర్జున్ 'వేదం' రిలీజ్ డేట్ ఛేంజ్
ఎన్నోసార్లు రిలీజ్ డేట్లు మార్చిన అల్లు అర్జున్ వేదం చిత్రం విడుదల తేదీని మరో సారి మార్చారు. పోస్ట్ ప్రొడక్షన్ లో ఆలస్యం అవటం వల్ల మరి కాస్త ముందుకు జరిపి జూన్ మొదటి వారంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తారని చెప్తున్నారు. గమ్యం చిత్రంతో ఒక్కసారిగా స్టార్ డైరక్టర్ గా మారిన క్రిష్...ఈ 'వేదం' ను డైరక్ట్ చేస్తున్నారు. అయిదు పాత్రలతో, అయిదు కథలతో సరదాగా సాగే విభిన్న చిత్రం ఇది. అల్లు అర్జున్ ది ఒక కథ, మనోజ్‌ది ఒక కథ, అనుష్క ది మరో కథ, మనోజ్ వాజ్‌పాయ్ ది వేరొక కథ..ఇలా ఉంటుంది సినిమా.
మనోజ్, అల్లు అర్జున్ కలిసి పాల్గొనే సన్నివేశాలు క్లైమాక్స్ లో ఉంటాయి. రియలిస్టిక్ ఎప్రోచ్ కలిగిన హ్యుమన్ డ్రామా ఈ సినిమా దీనిని వర్ణిస్తున్నారు. ఇక అనుష్క ఇందులో సరోజ అనే వేశ్యగా కనిపంచనుంది. అలాగే అల్లు అర్జున్...స్లమ్ లో తిరిగే మాస్ కుర్రాడుగా ఉంటాడు. మనోజ్ ఓ రాక్ స్టార్ గా ఉంటాడు. అలాగే అల్లు అర్జున్ పక్కన దీక్ష సేధ్ నటిస్తోంది. దాదాపు 40 నిమిషాల నుంచి గంట సేపుంటుంది అల్లు అర్జున్ పాత్ర..ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఉంది. ఇక ఇరవై ఏడున గోపీచంద్ తాజా చిత్రం గోలీమార్ రిలీజ్ అవుతోంది. పూరీ జగన్నాధ్ రూపొందించిన ఈ చిత్రంలో గోపీ చంద్ ఎనకౌంటర్ స్పెషలిస్ట్ గా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని 500 ప్రిట్లతో రిలీజ్ నిర్మాత బెల్లంకొండ సురేష్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











