నేను గాఢమైన ప్రేమలో ఉన్నా ...'వేదం' క్రిష్
గమ్యం, వేదం చిత్రాలతో తానేంటో ప్రూవ్ చేసుకున్న క్రిష్ తాజాగా ఫేస్ బుక్ లో ఓ మెసేజ్ పెట్టారు. అది ..ఐ యామ్ ఇన్ డీప్ లవ్ అని. దాంతో ఆయనకు దాదాపు యాభై నుంచి అరవై దాకా ఎవరా లక్కి గర్ల్ అంటూ మెసేజ్ లు వ్చచాయియ అప్పుడు ఆయన అసలు విషయం రివిల్ చేసారు. క్రిష్ ఈజ్ ఇన్ లవ్...విత్ హిజ్ స్క్రిప్టు...అంటూ చిలిపిగా మెసేజ్ పెట్టారు. దాంతో ఎంతో ఊహించుకున్న చాలా మంది ఒక్కసారిగా నీరుకారిపోయారు. సినిమాల్లోనే కాకుండా నిజ జీవితంలోనూ క్రిష్ ఇలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ తో వ్యవహరిస్తూంటారు. ప్రస్తుతం క్రిష్...తెలుగులో విజయవంతమైన వేదం చిత్రాన్ని వానమ్ టైటిల్ తో రీమేక్ చేస్తున్నారు.ఈ రీమేక్ లో శింబు, అనుష్క, భరత్, స్నేహ ఉల్లాల్, వేగ, సోనియా అగర్వాల్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











