వేదం, ఓం శాంతి చిత్రాలు ఒకే స్క్రీన్ ప్లేతో..?

By Srikanya

క్రిష్ దర్శకత్వంలో రెడీ అవుతున్న వేదం చిత్రం, ప్రకాష్ దర్శకత్వంలో రూపొందిన ఓం శాంతి చిత్రం రెండూ..ఒకే తరహా స్క్రీన్ ప్లే తో సాగుతాయని విశ్వసనీయ సమాచారం. చిత్రంలో ప్రధాన పాత్రలు ఒక దానితో ఒకటి సంభందం లేకుండా వేర్వేరు కథలతో ఉండి చివరలో అవి ఓ క్లైమాక్స్ లో కలుసుకుని వారి జీవన ఫంధాన్ని పునర్ నిర్వచించుకోవటమే కధాంశం అంటున్నారు. ఈ తరహా చిత్రాలు గతంలో హాలీవుడ్ లో వచ్చేవి. ఆస్కార్ విన్నింగ్ సినిమా క్రాష్ ఇదే తరహాలో ఉంటుంది. అలాగే ఆ మధ్య హిందీలో వచ్చిన ముంబయి మేరీ జాన్ చిత్రం, యహీ మేరీ ఇండియా లు కూడా ఇదే స్క్రీన్ ప్లేతో ఉండటం గమనార్హం. ఇక వేదం చిత్రంలో అల్లు అర్జున్, అనూష్క, మంచు మనోజ్,మనోజ్ బాజపయ్ లు ప్రధాన పాత్రల్లో కనిపిస్తారు. అల్లు అర్జున్ మాస్ క్యారెక్టర్ చేస్తూండగా, మనోజ్..రాక్ స్టార్ గా కనిపిస్తాడు. అలాగే అనూష్క వేశ్య పాత్రలో కీలకంగా కనిపిస్తుంది. వీరివి ఎవరి కథలు వారివే. ఇవన్నీ చివరకు ముడిపడతాయి.క్రిష్ గత చిత్రం గమ్యం మంచి హిట్ అవటం అంతటా మంచి పేరు తేవటంతో మంచి అంచనాలే ఉన్నాయి.

అదే ఓం శాంతి దగ్గరకు వస్తే ఈ చిత్రంలో ఐదు కథలు ఉంటాయి. ఆ కథలు..ఐదు జీవితాలను చెప్తాయి..వీటితో పాటు ఓ జీవిత సత్యం కూడా ఆవిష్కారమవనుంది. ఈ చిత్రం ద్వారా ప్రకాష్ పరిచయం అవుతున్నారు.ఇందులో నవదీప్‌ పేరు ఆనంద్‌. కాలేజీ దాటగానే మంచి ఉద్యోగం. వారాంతంలో క్లబ్‌, పబ్‌. అంతా హ్యాపీలైఫ్‌. ఓ కష్టం ఎదురైనప్పుడే అతనికి సుఖం విలువ ఏమిటో తెలుస్తుంది.అదితి శర్మ పాత్ర పేరు అంజలి...ఆమెది ఏదైనా పక్కాగా, ప్రణాళికబద్ధంగా ఉండాలనుకొనే పాత్ర. మరో హీరోయిన్ బిందుమాధవి పాత్ర పేరు నూరి. నిఖిల్‌ పాత్ర పేరు తేజ.అతని టార్గెట్‌ రవితేజ. సినిమా హీరో అవ్వాలని అతని జీవితాశయం. ఇక ముఖ్యమైన పాత్ర కాజల్..ఆమె పేరు మేఘన. ఇక ఇళయరాజా సంగీతం సమకూర్చిన 'ఓంశాంతి'లోని పాటలు మార్కెట్లో విడుదల అయి మంచి టాక్ తెచ్చుకున్నాయి. బాణం వంటి ప్రయోగాత్మక చిత్రం నిర్మించి అందరి ప్రశంసలూ అందుకున్న త్రీ ఏంజిల్స్‌ స్టూడియోస్‌ ప్రై.లి. సినిమా కావటంతో ఈ చిత్రంపైనే మంచి అంచనాలే ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X