twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మంచు మనోజ్ బర్తడే గిప్ట్...'వేదం' రిలీజ్

    By Srikanya
    |

    క్రిష్ (గమ్యం ఫేమ్) రూపొందిస్తున్న 'వేదం' చిత్రం మే ఇరవైన రిలీజ్ కానుంది. ఆ రోజు అందులో హీరోగా చేసిన మంచు మనోద్ పుట్టిన రోజు కావటం విశేషం. మొన్న విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడు కేబుల్ శ్రీను గా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నారు. అనూష్క..వేశ్య సరోజ గానూ, మంచు మనోజ్ రాక్ స్టార్ గానూ అలరించనున్నారు. మల్టిఫుల్ నేరేషన్ తో ఏ పాత్రకా పాత్ర మిగతా పాత్రలతో సంబంధం లేకుండా కథనంతో ఈ చిత్ర కథ సాగుతుంది. 'బిందాస్' తో ఓకే అనిపించుకున్న మంచు మనోజ్, ఇప్పటికే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి' చిత్రంలో ఎదిగిన అనూష్క కలిపి చేస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మనోజ్ ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం సంగీతం ప్రధానంగా వుంటుంది. అందులో మనోజ్ బాలసుబ్రహ్మణ్యం అభిమానిలా కనిపిస్తాడు. ఇక కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మనోజ్ బర్తడే గిప్ట్ గా విడుదలయ్యే 'వేదం' చిత్రం మంచి హిట్ అయ్యి అతనికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుందాం.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X