Don't Miss!
- News బీజేపీలో చేరిన నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి: ఆ నియోజకవర్గం నుంచే పోటీ
- Sports CSK vs LSG: అతని వల్లే గెలిచే మ్యాచ్‌లో ఓడాం: రుతురాజ్ గైక్వాడ్
- Lifestyle ఈ 4 రాశుల వారు ఉత్తమ సెక్స్ భాగస్వాములు అవుతారు... వీరిని లైఫ్ పార్ట్నర్ గా పొందడం అదృష్టం!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మంచు మనోజ్ బర్తడే గిప్ట్...'వేదం' రిలీజ్
క్రిష్ (గమ్యం ఫేమ్) రూపొందిస్తున్న 'వేదం' చిత్రం మే ఇరవైన రిలీజ్ కానుంది. ఆ రోజు అందులో హీరోగా చేసిన మంచు మనోద్ పుట్టిన రోజు కావటం విశేషం. మొన్న విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ రావటంతో ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ చిత్రంలో అల్లు అర్జున్ స్లమ్ కుర్రాడు కేబుల్ శ్రీను గా మాస్ క్యారెక్టరైజేషన్ తో సాగే పాత్రను చేస్తున్నారు. అనూష్క..వేశ్య సరోజ గానూ, మంచు మనోజ్ రాక్ స్టార్ గానూ అలరించనున్నారు. మల్టిఫుల్ నేరేషన్ తో ఏ పాత్రకా పాత్ర మిగతా పాత్రలతో సంబంధం లేకుండా కథనంతో ఈ చిత్ర కథ సాగుతుంది. 'బిందాస్' తో ఓకే అనిపించుకున్న మంచు మనోజ్, ఇప్పటికే స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్, 'అరుంధతి' చిత్రంలో ఎదిగిన అనూష్క కలిపి చేస్తున్న చిత్రం కావటంతో మార్కెట్లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ప్రసాద్ దేవినేని, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఇక మనోజ్ ప్రస్తుతం రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఝుమ్మంది నాదం అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ చిత్రం సంగీతం ప్రధానంగా వుంటుంది. అందులో మనోజ్ బాలసుబ్రహ్మణ్యం అభిమానిలా కనిపిస్తాడు. ఇక కృష్ణవంశీ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన రాజా దర్శకత్వంలో 'ఊకొడతారా..ఉలిక్కిపడతారా" అనే పేరుతో సంపూర్ణ హాస్య రసభరిత చిత్రాన్ని చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే మనోజ్ బర్తడే గిప్ట్ గా విడుదలయ్యే 'వేదం' చిత్రం మంచి హిట్ అయ్యి అతనికి ఆనందాన్ని కలిగించాలని కోరుకుందాం.