బన్నీ, మనోజ్ లు ఆవేదనతో బయటికొచ్చారు..
'వేదం" సినిమా విషయంలో మంచు మనోజ్ అలకపాన్సు ఎక్కాడనీ, అందుకే టైటిల్స్ లో 'గెస్ట్ అప్పీయరెన్స్" అని పేరు వేయించుకున్నాడనీ టాలీవుడ్ లో గాసిప్స్ వినిపించిన, వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమి లేదంటూ, మనోజ్, అల్లు అర్జున్ మీడియా ముందుకు జంటగా వచ్చారు.
పైరసీ కారణంగా ఝ'వేదం" సినిమా చాలా నష్టపోయిందని, సినీ పరిశ్రమను పైరసీ నుంచి రక్షించాలని మంత్రి గీతారెడ్డిని కలిసి 'వేదం" టీమ్ ఓ వినతిపత్రాన్ని అందజేసింది 'వేదం" టీమ్. సినిమా రిలీజైన మరుసటి రోజే డీబీడీ క్వాలిటీతో పైరసీ వీడియోలు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయని బన్నీ, మనోజ్ మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. పైరసీ వీడియోల వల్లే చిన్న సినిమా పెద్ద సినిమా అన్న తేడా లేకుండా మొత్తం సినీ పరిశ్రమ నష్టాల పాలవుతోందని బన్నీ, మనోజ్ కలిసికట్టుగా వ్యాఖ్యానించారు. పైరసీ పై పొరపాటు సంగతేమోగానీ, సినిమా పబ్లిసిటీ కోసం పెద్దగా మీడియాలో కన్సించక పోవడంతో తలెత్తిన గాసిప్స్ ని మనోజ్ ఇలా బన్నీతో కలిసి చల్లార్చే శాడన్నమాట.


Click it and Unblock the Notifications











