అల్లు అర్జున్,అనూష్క ప్రారంభం
అల్లు అర్జున్ చేస్తున్నాడనే విని తాను వేదం చిత్రంలో ఒప్పుకున్నానని అనూష్క చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడా కాంబినేషన్ చిత్రం ప్రారంభం కానుంది. అల్లు అర్జున్, అనూష్క కాంబినేషన్లో గమ్యం ఫేమ్ క్రిష్ తాజాగా రూపొందించనున్న వేదం చిత్రం జూన్ 12న ప్రారంభంకానుంది. ర్యాగింగ్ నేపధ్యంలో రూపొందనున్నట్లు సమాచారం. ఈ చిత్రం సినీమాక్స్ మల్టీ ఫ్లెక్స్ లో అల్లు అర్జున్, అనూష్క, మనోజ్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటించునున్న ఈ చిత్రం ఆర్కా ఫిలింస్ బ్యానర్ పై నిర్మింతమవుతోంది. ఇక మల్టీస్టార్స్ ఫిలింస్ రావనుకుంటున్న టైంలో ఈ చిత్రం ప్రారంభం కావటం శుభసూచికమని పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెలాఖరునుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుని ఈ సంవత్సరం ఆఖరులో ధియోటర్స్ లోకి రానుంది.
vedam allu arjun anushka gamyam krish ragging manoj kumar multi stars అల్లు అర్జున్ వేదం అనూష్క గమ్యం క్రిష్ మనోజ్ కుమార్ ఆర్కా ఫిలింస్ బ్యానర్ మల్టీస్టార్స్


Click it and Unblock the Notifications