ముద్దుల వీరుడితో సౌత్ ఇండియన్ భామ రొమాన్స్.. మరో సంచలనానికి సిద్దమైన దృశ్యం దర్శకుడు!
బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ పేరు చెబితే అతడి నటించిన శృంగార సన్నివేశాలే ఎక్కువగా గుర్తుకు వస్తాయి. ఈ ముద్దుల వీరుడు ఓ స్పానిష్ చిత్ర రీమేక్ లో నటించేందుకు సిద్ధం అవుతున్నాడు. ఈ చిత్రం కోసం పలువురు హీరోయిన్లని పరిశీలించిన తరువాత హీరోయిన్ గా సౌత్ బ్యూటీ వేదికని ఎంపిక చేశారు. దృశ్యం చిత్రం తో సంచలనం రేపిన జీతూ జోసెస్ ఈ చిత్రానికి దర్శకుడు కావడం విశేషం. ఇప్పటి నుంచే ఈ చిత్రంపై ఆసక్తి పెరుగుతోంది.

సౌత్ బ్యూటీ ముద్దుల వీరుడితో
ఇమ్రాన్ హష్మీ చిత్రాలలో రొమాన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అలాంటి హీరో సరసన సౌత్ హీరోయిన్ నటిస్తోందంటే ఆసక్తి నెలకొనడం సహజమే. ముని, బాణం, విజయదశమి వంటి సౌత్ చిత్రాల్లో నటించిన వేదిక తన బాలీవుడ్ డెబ్యూ మూవీలో ఇమ్రాన్ హష్మీ సరసన నటించబోతోంది.

దృశ్యం దర్శకుడు
మోహన లాల్ కథానాయకుడిగా వచ్చిన దృశ్యం చిత్రం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చిత్రం అనేక సంచలనాలు సృష్టించింది. పలు భాషల్లో రీమేక్ అయి కూడా విజయం సాధించింది. ఈ చిత్రంతో జీతూ జోసెఫ్ క్రేజీ దర్శకుడిగా మారిపోయాడు.

మరో సంచలనం
జీతూ జోసెఫ్ మరో సంచలనానికి తెర తీయబోతున్నాడు. ఓ స్పానిష్ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయడానికి సిద్ధం అవుతున్నాడు. స్పానిష్ లో మంచి విజయం సాధించిన థ్రిల్లర్ చితం 'ది బాడీ'ని ఈ దర్శకుడు హిందీలో తెరక్కించబోతుండడం విశేషం.

కాలేజీ యువతిగా
ఈ చిత్రంలో వేదిక కాలేజీ యువతిగా మామాయకమైన పాత్రలో నటిస్తుందని దర్శకుడు తెలిపాడు. అనేక మంది నటీమణులని పరిశీలించిన తరువాత ఈ పాత్రకు వేదిక సరిపోతుందని భావించామని దర్శకుడు తెలిపాడు.


Click it and Unblock the Notifications











