»   » లాస్‌ఏంజిల్స్‌లో రాజమౌళిపై ప్రశ్నల వర్షం (వీడియో)

లాస్‌ఏంజిల్స్‌లో రాజమౌళిపై ప్రశ్నల వర్షం (వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: ప్రముఖ దర్శకుడు రాజమౌళి రూపొందించిన 'బాహుబలి' చిత్రానికి మన దేశం నుంచే కాకుండా ప్రపంచ దేశాల సినీ వర్గాల నుంచి కూడా ప్రశంసలు అందుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల లండన్‌ ఫిలిం ఫెస్టివల్‌లో బాహుబలి ప్రదర్శించారు. అక్కడ ప్రపంచ సినీ దిగ్గజాలు చిత్ర దర్శకుడు రాజమౌళిని ప్రశంసలతోనే కాకుండా ప్రశ్నలు తోనూ ముంచెత్తారు.

బుధవారం రాత్రి అమెరికాలోని లాస్‌ఏంజిల్స్‌లో ఏఎండీ సంస్థ ఏర్పాటు చేసిన డైరెక్టర్స్‌ పానెల్‌ అనే ప్రత్యేక కార్యక్రమంలో చిత్ర దర్శకులు రాజమౌళి పాల్గొని ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.


ఈ సందర్భంగా ఆయనకు ప్రశ్నల కంటే అభినందనలే ఎక్కువ రావడం విశేషం. బాహుబలి -2తోనే ముగిస్తారా.. దానికి కొనసాగింపుగా మరో చిత్రం తీసే ఆలోచన ఏమైనా ఉందా!.. అని ఓ అభిమాని అడిగారు. దీనిపై స్పందించిన రాజమౌళి తాను రాసుకున్న కథ బాహుబలి-2తో ముగుస్తుందన్నారు.

 

rajamouli2

కానీ ఈ పాత్రలతో మరిన్ని కథలను జోడించి చిత్రం రూపంలో కాకుండా ఇతర రూపాల్లో వాటిని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. 'బాహుబలి' చిత్రీకరణలో ఉపయోగించిన గ్రాఫిక్‌ మాయాజాలం, మహిష్మతి నగర నిర్మాణం చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 'బాహుబలి-2' కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు వారు తెలిపారు.


అలాగే...

ఫ్రాన్స్‌లో జరుగుతున్న 20వ 'ది స్ట్రేంజ్‌ ఫెస్టివల్‌'(లా ట్రాన్స్‌ ఫిలింఫెస్టివల్‌) ఈ నెల 3 నుంచి 13 వరకు జరిగింది. ఈ ఫిలింఫెస్టివల్‌లో తెలుగులో అత్యంత భారీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శించారు.


ఈ చిత్రాన్ని వీక్షించిన అనంతరం హాల్‌లో కరతాళ ధ్వనులు మార్మోగాయని చిత్ర హీరో ప్రభాస్‌ ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు. తమ చిత్రాన్ని అభినందించినందుకు కృతజ్ఞతలు అంటూ ఆయన వారికి ధన్యవాదాలు తెలిపారు.

 

rajamouli1

భారతీయ సినీ చరిత్రలో ఓ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది 'బాహుబలి'. ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా విశేష ప్రేక్షకాదరణ పొందింది. మన దేశంలో అత్యధిక స్థూల వసూళ్లు సాధించిన చిత్రంగా రికార్డులు సృష్టించింది.

చైనాలో 'బాహుబలి'


ఇప్పుడు ఇతర దేశాల్లోనూ సందడి చేసేందుకు సిద్ధమైంది. చైనాలో 'బాహుబలి'ని 5000 థియేటర్లలో విడుదల చేస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాల మేరకు చిత్రాన్ని ఎడిట్‌ చేశారు. పలు చలన చిత్రోత్సవాలకీ పంపుతున్నారు. చైనాలో ఈ చిత్రం నవంబరు నుంచి సందడి చేయబోతోంది. అక్కడ 'పీకే' చిత్రాన్ని విడుదల చేసిన ఈ స్టార్స్‌ ఫిలిమ్స్‌ సంస్థనే 'బాహుబలి'ని విడుదల చేస్తుండడం విశేషం.

'పీకే'కి చైనాలో మంచి ఆదరణ లభించింది. అదే తరహాలో 'బాహుబలి' కూడా చైనా ప్రేక్షకుల్ని అలరిస్తుందని సినీ వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రభాస్‌, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం 'బాహుబలి'. శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని నిర్మించారు.

English summary
SS Rajamouli is in Los Angeles on Friday for an interactive session with the AMD Panel which include Pete Draper and Raja Koduri at Raleigh Studios. The master craftsman shared his experiences while making 'Baahubali', Worldclass Visual Effects and many more.
Please Wait while comments are loading...