»   » షాక్ : బ్లూ ఫిల్మ్ డీవీడీలపై ఆమె ఫోటోలు

షాక్ : బ్లూ ఫిల్మ్ డీవీడీలపై ఆమె ఫోటోలు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : తొలి సినిమా బిందీ బజార్‌లో నటిగా మారిన మోడల్ వేదితా ప్రతాస్ సింగ్ ఆ సినిమాలో ఏ రేంజిలో శృంగార సీన్లు పండించిందో కొత్తగా చెప్పక్కర్లేదు. తన సహ నటుడు ప్రశాంత్ నారాయణన్‌తో ఆమె హాట్ హాట్ ముద్దు సీన్లు, పడకగది సన్నివేశాల్లో దుమ్ము రేపింది. ప్రస్తుతం ముంబై 123 కి.మీ అనే చిత్రంలో నటిస్తోంది.

తాజాగా వేదితా ప్రతాప్ సింగ్‌కు ఓ షాకింగ్ అనుభవం ఎదురైంది. ముంబైలోని రోడ్ సైడ్ దుకాణాల్లో ఆమె ఫోటోతో కూడిన నీలి చిత్రాల డీవీడీలు దొరుకుతున్నాయి. 'నషా జిస్మ్ కా' అనే ఫోర్న్ డీవీడీ కవర్‌పై తన ఫోటో కనిపించడంతో షాకైన ఆమె తాను అసలు ఎలాంటి అశ్లీల చిత్రంలో నటించడం లేదని, ఆ ఫోటో వారికి ఎలా దొరికిందో అర్థం కావడం లేదని వివరణ ఇచ్చింది.

విక్కీ అనే ఫోటోగ్రాఫర్ ఎనిమిది నెలల క్రితం ఆమెతో ఫోటో షూట్ చేసాడు. పేరొందిన దిన పత్రికలకు, వెబ్ సైట్లకు ఈ ఫోటోలను పంపుతానని, పబ్లిసిటీ పెరిగేలా చేస్తానని చెప్పాడట. కానీ ఇప్పటి వరకు అందుకు సంబంధించిన ఫోటోలు ఏ పత్రికలోనూ, ఏ వెబ్ సైట్ లోనూ కనిపించలేదు. కానీ తాజాగా బ్లూఫిల్మ్ డీవీడీలపై కనపడటంతో ఖంగుతింది.

నేను ఏ తప్పూ చేయలేదు కాబట్టి ఇలాంటివి తనకెరీర్‌కి నష్టం కలిగించవనే అనుకుంటున్నాను. తల్లిదండ్రులు, తెలిసిన వాళ్లు ఏమనుకుంటారో అనేదే నా బాధంతా. మా అమ్మతో మాట్లాడిన తర్వాత మనసు కాస్త కుదుట పడింది. ఏ తప్పూ చేయలేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదని ఆమె ధైర్యం చెప్పిందని వేదితా చెప్పుకొచ్చింది.

English summary
Bollywood actress Vedita Pratap Singh was horrified when she stumbled upon a picture from her portfolio that had been shot by photographer Vicky Idnani eight months ago, on the front cover of a porn DVD titled Nasha Jism Ka.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu