వీళ్ళే అంటున్న మంత్ర నిర్మాత
మంత్ర నిర్మాతల్లో ఒకరైన రవిప్రకాష్ వీళ్ళే అనే టైటిల్ తో ఓ ధ్రిల్లర్ నిర్మించటానికి సన్నాహాలు చేస్తున్నారు. వాన చిత్రంతో పరిచయమైన హీరో వినయ్ ఈ చిత్రంలో హీరోగా చేయనున్నాడు. బాలీవుడ్ బ్యూటీ నిషా అగర్వాల్ హీరోయిన్ గా చేస్తోంది. మంత్ర మరో నిర్మాత శివాజితో డైరీ చిత్రం తీసిన సంగతి తెలిసిందే. అది క్రిందటి వారం రిలీజై ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. ఇక మంత్రలో నటించిన ఛార్మి తాజాగా కావ్యాస్ డైరీతో ఫ్లాఫ్ టాక్ తెచ్చుకుంది. మంత్ర డైరక్టర్ తులసి రామ్ మాత్రం ఇప్పటివరకూ ఏ సినిమా ప్రారంభించలేదు. అతను ప్రస్తుతం ఎమ్.ఎస్.రాజు క్యాంపులో ఉన్నట్లు సమాచారం.ఆయన తన కుమారుడు హీరోగా చేసే సినిమాకి అతన్ని డైరక్టర్ గా చేసే అవకాశమున్నట్లు కొంతకాలంగా వినపడుతోంది.మంత్ర విజయానంతరం ఎవరికి వారే విడిపోయి అవకాశాలు కోసం ట్రై చేస్తున్నారు. వీళ్ళు కలిసి మరో ప్రాజెక్టు చేసినా మరో హిట్టు ఈ పాటికి ఇద్దురనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.


Click it and Unblock the Notifications











