మంచు విష్ణు దర్శకుడుతో రెడ్ హ్యాడెండ్ గా హాట్ హీరోయిన్

By Srikanya

హైదరాబాద్: మంచు విష్ణుతో వస్తాడు నా రాజు చిత్రంతో తెలుగుకి పరిచయమైన దర్శకుడు హేమంత్ మధుకర్. ఆయన రీసెంట్ గా తెలుగు చిత్రం 'మేడిన్ వైజాగ్' ఆడియో ఫంక్షన్ కి హాజరయ్యారు. ఆ చిత్రం ఆడియో పంక్షన్ కి హాజరైన వీణా మాలిక్ తో ఆయన చనువుగా ఉండటం అందరి దృష్టిలో పడింది. ఆడియో పంక్షన్ విషయాన్ని ప్రక్కన పెట్టి ఇద్దరూ గుసగుసలు ఆడుకుంటూ ఉండిపోయారు. ఫంక్షన్ అయ్యాక ఇధ్దరూ కలిసి బయిటకు వెళ్లారు. ఈ విషయమై బాలీవుడ్ మీడియా కథనాలు ప్రసారం చేస్తోంది.

న్యూడ్ ఫోజులతో సంచలనం సృష్టించి సినిమా అవకాశాలు దక్కించుకున్న పాకిస్థానీ భామ వీణా మాలిక్ ప్రస్తుతం పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో 'నగ్న సత్యం' అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తెలుగు తెరపై అడుగిడిన నేపథ్యంలో శృంగార పరమైన సినిమాలు చేద్దామని కొందరు నిర్మాతలు సిద్ధం అయ్యారు. వీణా మాలిక్ ప్రస్తుతం తెలుగులో చేస్తున్న 'నగ్న సత్యం' సినిమాకు రూ. 1.5 కోట్లు తీసుకుంటోందట. ప్రస్తుతం తెలుగులో టాప్ హీరోయిన్స్ గా ఉన్న వారికి కూడా ఈ రేంజిలో రేటు లేదు.

అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు 'నగ్న సత్యం' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించారు.

ఇక యశ్విన్, నిఖితా నారాయణ్ జంటగా నిషానేహ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం 'మేడిన్ వైజాగ్'. కన్మణి దర్శకత్వంలో ఉదయ్‌శంకర్ ఆకెళ్ల ఈ చిత్రాన్ని తమిళ, తెలుగు భాషల్లో నిర్మిస్తున్నారు. నిర్మాత ఉదయ్‌శంకర్ చిత్ర విశేషాలు వివరిస్తూ మరాఠిలో విజయవంతమైన ఓ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించామని, ప్రస్తుతం రీ రికార్డింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తికావస్తుందని తెలిపారు. ఓ హైదరాబాద్ అమ్మాయి జీవితంలో ఎదురైన ఆసక్తికర పరిణామాలే ఈ చిత్ర కథాంశమని, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని దర్శకుడు కన్మణి తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: ఎడవల్లి, సంగీతం: విశ్వజిత్ జోషి, ధర్మతేజ, కెమెరా: నాగమల్లి, ఆర్ట్: సత్యనారాయణ, ఎడిటింగ్: సురేష్ అర్స్, నిర్మాత: ఉదయ్‌శంకర్ ఆకెళ్ల, దర్శకత్వం: కన్మణి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X