»   » తెలుగులో వీణా మాలిక్‌ 'నగ్నసత్యం'

తెలుగులో వీణా మాలిక్‌ 'నగ్నసత్యం'

By Srikanya
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    హైదరాబాద్ : పాకిస్థాన్‌కి చెందిన వివాదాస్పద నటి వీణా మాలిక్‌ త్వరలో తెలుగు తెరను వేడిక్కించనుంది. శృంగారపరమైన పాత్రలు పోషించే ఆమె తెలుగులో నటించే చిత్రం టైటిల్ 'నగ్నసత్యం'. అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 10న చిత్రీకరణ మొదలవుతుంది. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.


    చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల విరామం తర్వాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి శిష్యుడైన రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అనూరాధ ఫిలింస్ పతాకంపై రూపొందనుంది.

    పాక్‌ నుంచి ముంబైకి చేరుకొని హిందీ చిత్రాల్లో నటిస్తోంది. కన్నడంలో సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం సందేహించని వీణా మాలిక్‌ అనేక వివాదాల్లో చిక్కుకుంది. విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు తెచ్చిన చిత్రంలో నటించడానికి సూపర్‌ ఎక్సైట్‌మెంటుతో సంతకం చేశానని అంటోంది ముద్దుగుమ్మ. ఎఫ్ మ్యాగజైన్ ముఖచిత్రం పాకిస్ధాన్ ఆర్మీ దుస్తులతో సెక్సీ ఫోజులిచ్చిన అమ్మడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పాక్ లో అమ్మడికి మతపెద్దలు కూడా తలంటారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించింది. ఇప్పడు దక్షిణాది డర్టీపిక్చర్ కు చేసి హాట్ టాపిక్ గా మారింది.

    'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌హాట్‌మగ' సినిమా విడుదల తరువాత తన రాత మారిపోతుందని వీణామాలిక్‌ చెప్పారు. ఈ సినిమా ఫోటో షూట్‌కోసం బెంగళూరు వచ్చిన ఆమె మీడీయాతో మాట్లాడారు. 'డర్టీ పిక్చర్‌...' విడుదల తరువాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. సిల్క్‌ స్మిత జీవితం గురించి చదివానని తెలిపారు.

    English summary
    Controversial Pakistani Actress, Veena Malik, is now working in a Telugu film. Her debut Telugu film Nagna Satyam was launched on in Hyderabad. This film is being directed by Rama Rao and produced by Chadalavada Srinivasa Rao under Anuradha films banner.
     

    తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

    X
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more