‘నగ్న సత్యం’ షూటింగ్‌లో వీణామాలిక్ అరెస్ట్!
హైదరాబాద్ : న్యూడ్ ఫోజులతో అందరి దృష్టిని ఆకర్షించి పాకిస్థానీ నటి వీణా మాలిక్ ప్రస్తుతం నగ్న సత్యం అనే తెలుగు సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆమెను సినిమా షూటింగులో అరెస్టు చేసి హైదరాబాద్ జైలుకు తరలించారు. అయితే ఇదంతా రియల్ అరెస్ట్ కాదు, రీల్ లైప్ అరెస్ట్. సినిమాకు సంబంధించిన ఓ సీన్ చిత్రీకరణలో భాగంగానే ఆమెను అరెస్టు చేసారు.

‘నగ్న సత్యం' సినిమా షూటింగులో భాగంగా వీణా మాలిక్ ను అరెస్టు చేస్తున్నారు. ఆమె తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో పోలీస్ స్టేషన్ కు లాక్కెలుతున్న దృశ్యం.

ఇది చాలా టప్ సీన్ అని, పోలీసులు నన్ను జైల్లోకి లాక్కెళ్లండం మాటల్లో చెప్పలేకపోతున్నానని, షూటింగులో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నానని వీణా మాలిక్ చెప్పుకొచ్చింది.

తొలిసారి తెలుగు సినిమాలో నటిస్తుండటం ఆనందంగా ఉందని వీణా మాలిక్ అంటోంది.

నగ్నం సత్యం చిత్రం టాలీవుడ్లో తనకు మంచి బ్రేక్ ఇస్తుందనే నమ్మంతో ఉంది వీనా మాలిక్. సినిమా కాన్సెప్టు తనకు ఎంతో నచ్చిందని వీణా మాలిక్ వెల్లడించింది.

కన్నడలో సిల్క్ సకత్ హాట్ మగ' సినిమా తర్వాత నగ్నసత్యం మూవీ వీణా మాలిక్ నటిస్తున్న రెండో సౌతిండియా చిత్రం.
నగ్న సత్యం సినిమా విషయానికొస్తే... అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











