»   » ఆ సెక్సీ బ్యూటీ హిందువుగా మారుతోందా?(పిక్చర్స్)

ఆ సెక్సీ బ్యూటీ హిందువుగా మారుతోందా?(పిక్చర్స్)

By Bojja Kumar
Subscribe to Filmibeat Telugu
For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

  ముంబై : పాకిస్థానీ భామ వీణా మాలిక్ బాలీవుడ్‌లో అడుగుపెట్టాక తన దైన ఆటిట్యూడ్, సెక్సీ బిహేవియర్‌తో వార్తల్లో వ్యక్తిగా మారిన సంగతి తెలిసిందే. ఆమె నడవడిక చూస్తుంటే హిందూ సంస్కృతిని ఆమె ఇష్ట పడుతున్నట్లు స్పష్టం అవుతోంది. హిందువులకు సంబంధించిన పలు పండగల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడమే ఇందుకు నిదర్శనగా చెప్పుకుంటున్నారు.

  2012లో ఈ ముస్లిం బేబ్ గణేశ్ చతుర్థి సందర్భంగా తన ఇంటికి గణేశుడి ప్రతిమను తీసుకెళ్లి పూజించింది. అదే విధంగా హోళీ పండగను కూడా సెలబ్రేట్ చేసుకుంది. ఇండియాలో ఆమెతో కలిసి పని చేస్తున్న పలువురు సహచరులు వీణా మాలిక్ హిందుత్వం పట్ల ఆసక్తి చూపుతోందని, ఆమె హిందూ మంతోలోకి మారే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

  గత సంవత్సరం ఆమె మీడియాతో మాట్లాడుతూ 'ఇండియాకు సంబంధించిన అన్ని పండగలను నేను ఎంతో ఇష్ట పడుతున్నాను' అని చెప్పుకొచ్చింది. తాజాగా వీణా మాలిక్ ఈ సంవత్సరం కూడా తన సినిమా సహచరులతో కలిసి హోళీ వేడుక జరుపుకుంది.

  ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్ తో పాటు సౌత్‌లో పలు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతోంది. ప్రస్తుతం ఆమె తెలుగులో రూపొందుతున్న 'నగ్న సత్యం' షూటింగులో పాల్గొంటోంది. తాజాగా ఆమె హోళీ సెలబ్రేట్ చేసుకున్న ఫోటోలను తన మైక్రోబ్లాగింగ్ సైట్లో పోస్టు చేసింది.

  పాకిస్థానీ మోడల్, సింగర్, నటి అయిన వీణా మాలిక్ రావల్పిండిలోని ముస్లిం కుటుంబంలో జన్మించింది.

  బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా ఇండియాలో అడుగు పెట్టిన వీణా మాలిక్ తనదైన రీతిలో పబ్లిసిటీ పెంచుకుని ఇక్కడి బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

  గలి గలి మేన్ చోర్ హై చిత్రం ద్వారా హిందీ చిత్రసీమలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ ఆ తర్వాత పలు చిత్రల్లో అవకాశం దక్కించుకుంది.

  ప్రస్తుతం ఆమె బాలీవుడ్లో నటించిన జిందగీ 50-50, ముంబై 125 కిమీ 3డి చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయి.

  తెలుగులో ఆమె నగ్నసత్యం అనే చిత్రంలో నటిస్తోంది. చదలవాడ శ్రీనివాష్ నిర్మాతగా రామారావు దర్శకత్వంలో ఈచిత్రం తెరకెక్కుతోంది.

  నగ్న సత్యం షూటింగ్ నవంబర్ 2012లో మొదలైంది. ప్రస్తుతం ఈచిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

  సిల్క్ సక్కత్ మగ అనే చిత్రం ద్వారా కన్నడలోనూ అడుగు పెట్టింది వీణా మాలిక్

  English summary
  Veena Malik is a Pakistani actress, but she is fallen in love with the ethnic flavours of India. She is even celebrating all major Hindu festivals with lot of interest. In 2012, this Muslim babe celebrated the Ganesh Chaturthi by bringing home the Ganapati idol. This year, she is set to celebrate Holi. Sources close to the actress claim that she is so much fascinated by Hindu culture that it would not be an exaggeration if she convert to Hindu.
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more