అబద్దం అంటూ... న్యూడ్ భామ గగ్గోలు
నేను మ్యాన్ హ్యాండలింగ్ చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవంలేదని, ఇదంతా కొందరు కావాలని చేస్తున్న దుష్ర్పచారమని పాకిస్థానీ మోడల్ వీణా మాలిక్ గగ్గోలు పెడుతోంది. ఈ మేరకు సోమవారం మీడియా ప్రకటన విడుదల చేసింది.
ప్రస్తుతం వీణా మాలిక్ 'ముంబై 125 కిలోమీటర్స్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రంలో నటిస్తున్న వేదిత అనే మరో నటి...వీణా తనపై మ్యాన్ హ్యాడ్లింగ్ చేసినట్లు ఇటీవల ఆరోపణలు చేసింది. దీనిపై వీణా స్పందిస్తూ ఆమె చేస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం పబ్లిసిటీ పెంచుకోవడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
''నేను గత 30 రోజులుగా దుబాయ్‌లోనే ఉన్నాను. ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, ఆమెతో ఇప్పటి వరకు షూటింగులో పాల్గొనలేదు, అలాంటప్పుడు నేనే ఆమెను ఎలా మ్యాన్ హ్యాడ్లింగ్ చేస్తాను'' అంటూ వీణా ప్రశ్నించింది.
ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న హేమంత్ మధూకర్ స్పందిస్తూ...డిసెంబర్ 24 నుంచి వీణా షూటింగులో లేదు, వేదిత ఆరోపిస్తున్న ఎలాంటి సంఘటనలు నా దృష్టికి రాలేదు అని చెప్పుకొచ్చారు.


Click it and Unblock the Notifications












