న్యూడ్ ఫోటో ఎఫెక్టు: తండ్రికి దూరమైన తార
పాకిస్థాన్ మోడల్ వీణా మాలిక్ ఫోటో నూలు పోగు కూడా లేకుండా న్యూడ్‌గా ఇండియన్ మెన్స్ మ్యాగజైన్ ఎఫ్.హెచ్.ఎంపై దర్శనం ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పాకిస్థాన్ లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు, నిరసనలు వెల్లువెత్తాయి. ఆమె పాకిస్థాన్ లో అడుగు పెడితే రాళ్లతో తమికొట్టే పరిస్థితులు కూడా ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ పరిణామాలతో వీణా ఫాదర్ మహ్మద్ అస్లామ్ కోపంగా ఉన్నారు. కూతురు తన పరువు, కుటుంబం పరువు తీసిందనే ఆగ్రహంతో ఉన్న ఆయన ఆమె(వీణా) నా కూతురే కాదు, ఇక ఆమెకు, తమకు బంధం తెగినట్లే అని మీడియాతో అన్నట్లు తెలిసింది.
కాగా.. నేనెప్పుడూ న్యూగ్ ఫోటోలకు ఫోజివ్వ లేదు, అది మార్ఫింగ్ ఫోటో అంటూ వీణా ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ పై రూ. 10 కోట్ల పరువు నష్టం దావే వేసింది. ఇదే విషయం తన తండ్రికి చెప్పినా ఆయన వీణా మాటలను నమ్మడం లేదు పాపం వీణా మాలిక్ కు ఎన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. కుటుంబానికి కూడా దూరం అయింది. ఇదిలా ఉంటే...ఆ ఫోటో నిజమైందే, మా దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అంటూ ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్ వివరణ ఇవ్వడం గమనార్హం.


Click it and Unblock the Notifications












