రామ్ చరణ్‌కు న్యూడ్ లేడీ సవాల్!
హైదరాబాద్ : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్‌లోని టాప్ టెన్ డాన్సర్లలో ఒకరనే విషయం అందరూ ఒప్పుకోవాల్సిన విషయమే. చిరుతతో ఎంట్రీ ఇచ్చిన చెర్రీ...ఇతర హీరోల పోటీని తట్టుకుని అతితక్కువ సమయంలోనే టాప్ హీరోగా ఎదిగాడు. చరణ్ ఎదుగుదలపై వారసత్వ ప్రభావం కొంత ఉన్నప్పటికీ....ఎక్కువ శాతం తన నటన, స్టైల్, డాన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకుని ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగాడు.
తాజాగా రామ్ చరణ్‌పై పాకిస్థానీ భామ వీణా మాలిక్ కన్ను పడింది. 'నగ్నసత్యం' అనే చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న వీణా మాలిక్ రామ్ చరణ్ కు ఓపెన్ సవాల్ విసురుతోంది. రామ్ చరణ్ గొప్ప డాన్సరే కావొచ్చు...కానీ నేను అతనికంటే మంచి డాన్సర్‌ని, అవకాశం ఇస్తే నిరూపించుకుంటా అని అంటోంది.
వీణా మాలిక్ వ్యాఖ్యల వెనక పబ్లిసిటీ స్టంట్ ఉందనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇలాంటి సవాళ్లు విసిరినంత మాత్రాన ఆమెకు తెలుగులో ఫాలోయింగ్ పెరిగి మెగా హీరోల సరసన అవకాశం వస్తుందను కోవడం వెర్రితనం కాక మరేమిటి.
వీణా మాలిక్ నటిస్తున్న 'నగ్న సత్యం' సినిమా వివరాల్లోకి వెళితే...అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల విరామం తర్వాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి శిష్యుడైన రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు.


Click it and Unblock the Notifications











