twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఏప్రియల్ ఫూల్ కోసమే సెక్సీ హీరోయిన్ పెళ్లి డ్రామా?

    By Srikanya
    |

    హైదరాబాద్‌ : పాకిస్తాన్‌ డ్రామా క్వీన్, బాలీవుడ్‌ వివాదాస్పద హీరోయిన్‌ వీణామాలిక్‌ తాను పెళ్ళి చేసుకున్నట్లుగా ప్రకటించారు. ఇటలీ దేశానికి చెందిన మోడల్‌ జాన్‌ ఎస్పోసిటోను వివాహమాడినట్లు వెల్లడించారు. సోమవారం సాయంత్రం కుటుంబసభ్యులు, సన్నిహితులమధ్య జరిగిన ఒక ఆంతరంగిక కార్యక్రమంలో తన వివాహం జరిగిందని వీణ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

    తన భర్త సనాతన ముస్లిమ్‌ అని తెలిపారు. మరోవైపు, ఈ సమాచారం తనకుకూడా తెలియదని వీణ మేనేజర్‌ చెప్పారు. దీంతో, ఎప్పుడూ సంచలనంకోసం అర్రులుచాచే వీణ, ఏప్రిల్‌ ఫూల్‌ చేయడానికి ఈ వార్తను సృష్టించి ఉంటుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు. అయితే అసలు నిజం ఏమిటన్నది ఆమె తెలియచెయ్యలేదు. అలాగే వివాహానికి సంభందించిన ఫోటోలు కూడా అప్ లోడ్ చెయ్యలేదు. కాబట్టి ఈ వివాహం అనుమానమే అంటున్నారు ఆమె ఫ్యాన్స్.

    ఇక మొదటినుంచీ వీణా మాలిక్ ఎప్పుడూ ఏదో ఒక సంచలన ప్రకటనతో వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆ మధ్య తన మాజీ బాయ్ ఫ్రెండ్స్ ప్రస్తావనతో హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఈ అమ్మడు పాకిస్థానీ క్రికెటర్ మహ్మద్ ఆసిఫ్, అమెరికన్ నేషనల్ ఫైసల్ అక్భర్ ఖాన్‌, నటుడు అస్మిత్ పటేల్‌తోనూ 'సం'బంధం పెట్టుకుంది. వారి గురించి ఆమె ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడతూ.....నా మాజీ బాయ్ ఫ్రెండ్స్‌ను నేనెప్పుడూ లవ్ చేస్తూనే ఉంటా, వాళ్లను నేను ఏదో ఒక సమయంలో మిస్పయినట్లు ఫీలవుతూనే ఉంటా. అలా అని తిరిగి వారి వద్దకు వెళ్లే రకం కాదు నేను, వాళ్లతో గడిపిన ఆనంద క్షణాలను గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తాను అంటోంది.

    తరచూ బాయ్ ఫ్రెండ్స్‌ను మారుస్తూ లైఫ్‌ను తెగ ఎంజాయ్ చేస్తున్న ఈ అమ్మడు ప్రస్తుతం బాలీవుడ్‌లో స్థిర పడేందుకు ప్రత్నిస్తుంది. పబ్లిసిటీ పెంచుకోవడానికి ఈ భామ ఇటీవల ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా దర్శనం ఇచ్చింది కూడా. ఈ దెబ్బతో వీణా మాలిక్ అంటే ఎవరో అందరికీ తెలిసి పోయింది.

    English summary
    
 
 Pakistani 'Drama Queen' Veena Malik left several hearts broken after she announced her marriage on microblogging website Twitter. In a twitter post, Veena said that she entered the wedlock on Monday evening in a private ceremony attended by family and close friends. "Im happy to announce that i got married last evening in a private ceremony with family n friends...details would be given to press soon!!!"
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X