లెస్బియన్ వీడియోలో రెచ్చిపోయింది!
ముంబై: బాలీవుడ్ అవకాశాలు దక్కించుకోవడమే లక్ష్యంగా భారత్‍లో అడుగు పెట్టి వీణా మాలిక్ ఆ మధ్య న్యూడ్ ఫోటో షూట్లు, పలువు బాలీవుడ్ సెలబ్రిటీలతో ఎఫైనర్లు నడుపుతూ వార్తల్లో వ్యక్తిగా నిలిచని విషయం తెలిసిందే. తాజాగా వీణా మాలిక్ 'డ్రామా క్వీన్' అనే ఆల్బమ్ తో రాబోంది. లేడీ గగా, రిహానా లాంటి పాప్ స్టార్ల అనుకరిస్తూ ఈ ఆల్బం రూపొందుతోంది.
ఈ ఆల్బమ్ హోమో సెక్సువల్ సంబంధాలను ప్రస్తావిస్తూ సాగనుంది. వెరీ వెరీ సెక్సీగా, హాట్ అండ్ గ్లామరస్‌గా రూపొందుతున్న ఈ ఆల్బంలో వీణా మాలిక్ తన లెస్బియన్ లవ్ పార్ట్‌నర్స్‌తో ముద్దు సీన్లో కనిపించే సన్నివేశాలు కూడా ఉండనున్నాయి. ఆమె అందాలు ఆరబోత కూడా ఓ రేంజిలో ఉండనుంది.
ఈ ఆల్బం గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ...ఈ ఆల్బమ్ ప్రత్యేకంగా లెస్బియన్స్, హోమో సెక్సువల్స్ కోసమే అంకితం చేస్తున్నా. వ్యక్తిగతంగా నేను వారిని సపోర్ట్ చేస్తున్నాను. నా మొదటి సింగిల్ ఆల్బమ్ అందరినీ అలరిస్తుందని ఆశిస్తున్నాను అంటూ వీణా మాలికి చెప్పకొచ్చింది.
స్వలింగ సంపర్కం గురించి ప్రస్తావిస్తూ....ఇతరులకు హానికలిగించనంత వరకు ఈ ప్రపంచంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బ్రతికే స్వేచ్ఛ ఉందని, వారి మనోభావాలను అడ్డుకోవడం, వారిని అసహ్యించుకోవడం సరికాదని అంటోంది వీణా మాలిక్. ఆడ-ఆడ...మగ-మగ సెక్సు చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదని, వారిని వ్యతిరేకించడం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటోంది.


Click it and Unblock the Notifications












