మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి వీణా మాలిక్
హైదరాబాద్: పాకిస్థాన్ నటి వీణా మాలిక్ గుర్తుందా? పలు బాలీవుడ్ చిత్రాలతో పాటు తెలుగులో ‘నగ్న సత్యం' చిత్రంలో నటించిన ఈ భామ మంగళవారం అమెరికాలో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని వీణా మాలిక్ భర్త అసద్ బషీర్ తన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. వీణా మాలిక్, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని అసద్ బషీర్ వెల్లడించారు. తమ కుటుంబంలో ఈ రోజు ఎంతో సంతోష కరమైన రోజు అని అసద్ బషీర్ వెల్లడించారు.

వీణా మాలిక్ గురించిన విషయాల్లోకి వెళితే...‘బిగ్ బాస్' 4వ సీజన్ రియాల్టీ షో ద్వారా ఇండియన్ ఎంటర్టెన్మెంట్ రంగంలోకి అడుగు పెట్టిన వీణా మాలిక్ బాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. జిందగీ 50-50, డర్టీ పిక్చర్(కన్నడ), సూపర్ మోడల్ లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో నగ్న సత్యం అనే చిత్రంలో నటించింది.
ప్రస్తుతం వీణామాలిక్ నటించిన ‘ముంబై 125 కి.మీ' అనే చిత్రం విడుదల కావాల్సి ఉంది. ఈ సినిమా తర్వాత ఇండియా వదిలి స్వదేశానికి వెళ్లిన వీణా మాలిక్ దుబాయ్ కి చెందిన వ్యాపార వేత్త అసద్ భషీర్‌ను పెళ్లాడింది. కొంత కాలంగా వీరు అమెరికాలో నివాసం ఉంటున్నారు.


Click it and Unblock the Notifications











