అమితాబ్ లాంటి భర్త కోసం న్యూడ్‌లేడీ వేట
ఎఫ్‌హెచ్ఎం మేగజైన్‌పై నూలు పోగు కూడా లేకుండా నగ్నంగా దర్శనం ఇచ్చి అందరి దృష్టిని తన వైపు తిప్పుకుని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పాకిస్థాన్ భామ వీణా మాలిక్ ఆ తర్వాత తరచూ ఏదో ఒక సంచలన చర్యతో వార్తల్లో వ్యక్తిగా నిలుస్తున్న సంగతి తెలిసిందే.
తాజాగా వీణా మాలిక్ చేసిన వ్యాఖ్యలు మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. మూవర్స్ అండ్ షేకర్స్ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ...వీణాకా వివాహ్ రియాల్టీ షోలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి లక్షణాలున్న వ్యక్తిని భర్తగా పొందేందుకు వేట ప్రారంభించానని, నాకు కాబోయే వాడికి గంభీరమైన గొంతు, అందంగా ఉంటే మిగతా విషయాలలో సర్దకు పోతానని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ లో రాణించాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగానే వీణా మాలిక్ నూలు పోగు కూడా లేకుండా తెగించింది. ఆమె ఊహించినట్లే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపించాయి.
నగ్నం నటిస్తుందనే వార్తలపై వీణా మాలిక్ స్పందిస్తూ... తాను ఏ సినిమాలోనూ న్నగంగా నటించడం లేదని, నటనకు ప్రాధాన్య ఉన్న పాత్రలను మాత్రమే తాను చేస్తానని తెగేసి చెప్పింది. ఈ చిత్రంలో నేను బ్యాడ్ గర్ల్ పాత్ర పోషిస్తున్నాను. ఆ పాత్ర పూర్తిగా నెగెటివ్‌గా, నటనకు ప్రాధాన్యం ఉండేలా ఉంది. దర్శకుడు వచ్చి అడగ్గానే వెంటనే ఒప్పుకున్నా అని చెప్పింది.


Click it and Unblock the Notifications











