రాజకీయాల్లోకి వస్తానంటున్న సెక్స్ బాంబ్
ఉన్నట్టుండి ఈ భామ దృష్టి రాజకీయాల వైపు మళ్లింది. భవిష్యత్‌లో పాకిస్థాన్ రాజకీయాల్లో క్రీయాశీలకంగా వ్యవహరిస్తానని అంటోంది. అయితే ఏ పార్టీలో, ఎప్పుడు వెళతాను అనే విషయాలను సమయం వచ్చినపుడు చెబుతాను అంటోంది. తన తండ్రి కోరిక తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని అంటోంది.
న్యాయవాది అయిన వీణా మాలిక్ తండ్రికి....తన కూతురు మోడలింగ్, సినిమా రంగంలో ప్రవేశించడం అస్సలు ఇష్టం లేదట. ఆమె దేశానికి సేవ చేసి మంచి పేరు తెచ్చుకోవాలనేది ఆయన కోరికట. అయితే తనకు మోడలింగ్, సినిమా రంగంపై ఆసక్తితో ఇటు వైపు వచ్చానని, భవిష్యత్‌లో తన లక్ష్యం పాకిస్థాన్ రాజకీయాలే అని స్పష్టం చేస్తోంది.
ప్రస్తుతం వీణా మాలిక్ హిందీలో జిందగీ 50-50, ముంబై 125 కి.మీ 3డి, సూపర్ మోడల్, ది సిటీ దట్ నెవర్ స్లీప్స్, మిస్టర్ మనీ, తెలుగులో నగ్నసత్యం, కన్నడలో సిల్క్ సక్కత్ మగా, పంజాబీలో జాట్స్ గోల్ మాల్ చిత్రాల్లో నటిస్తోంది.


Click it and Unblock the Notifications












