టీవీ పోగ్రాం ఎఫెక్టు: వీణామాలిక్‌కు 26 ఏళ్ల జైలుశిక్ష

By Srikanya

ఇస్లామాబాద్: పాకిస్దాన్ కు చెందిన బాలీవుడ్ నటి వీణా మాలిక్ కు ఆమె భర్త అసద్ బషీద్ లకు 26 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడింది. అంతేకాదు వీరితో పాటు టీవి అధిపతి,యాంకర్ లకు కూడా అదే శిక్షను వేసారు. ఇదంతా వీరు దైవ దూషణతో కూడిన కార్యక్రమం చేయటం వలన వచ్చింది. జైలుశిక్షతో పాటు రూ.13 లక్షల జరిమానా చెల్లించాలని కోర్టు తన తీర్పులో పేర్కొంది.

ఈ మధ్యనే వివాహం చేసుకున్న పాకిస్ధాన్ కి చెందిన వీణా మాలిక్, ఆమె భర్త దుబాయి కి చెందిన పారిశ్రామిక వేత్త అసద్ బషీద్ లు ఇద్దరూ జియో టీవి ఛానెల్ ఆహ్వానం మేరకు ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఈ సందర్బంగా బ్యాక్ గ్రౌండ్ లో ఓ పాటను ప్లే చేసారు. ఆ పాటకు వీణామాలిక్, ఆమె భర్త అసద్ బషీద్ ఖాన్ లు డాన్స్ చేసారు. అది ముస్లిం మతానికి చెందిన పవిత్రమైన పాట. దీంతో మహ్మద్ కుటుంబ సబ్యులను అవమానించారని కొందరు పిర్యాద్ చేయటంతో వీరిపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి.

Veena Malik, media mogul get 26 years in jail for blasphemy

తర్వాత ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసినందుకు పాక్ మీడియా గ్రూప్ జియో టీవీ అధిపతి మీర్ షకీల్-ఉర్-రె హ్మాన్, నటి వీణామాలిక్, ఆమె భర్త బషీర్, టీవీ యాంకర్ షయి ష్టా వాహిదిలకు 26ఏళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ యాంటీ టైజమ్ కోర్టు తీర్పు చెప్పింది.

ఇత వీణామాలిక్‌ గురించి తెలియని సినీ ప్రేక్షకులుండరంటే అతిశయోక్తి కాదు. ఈ పాకిస్థానీ సంచలన హీరోయిన్ మొదట్లో ఓ పత్రిక ముఖచిత్రంపై నగ్నంగా దర్శనమిచ్చి సంచలనం సృష్టించింది. ఈ ఫోటోగ్రాఫ్‌ పెద్ద దుమారాన్ని రేపినా, ఈ సంఘటన వివాదాస్పదమైనా ఆమె ఏ మాత్రం చలించలేదు. పైగా ఆ ముఖచిత్రం ఆమెకు మంచి గుర్తింపును, సినీ రంగంలో బోలెడన్ని అవకాశాలను తెచ్చిపెట్టింది. దీంతో పాప్యులర్‌ అయిన వీణా 'డర్టీ పిక్చర్‌ .. సిల్క్‌ హాట్‌ మగా' అనే కన్నడ చిత్రంలో ఛాన్స్‌ కొట్టేసింది.

వీణామాలిక్ మాట్లాడుతూ... నేను పాకిస్తాన్‌కు చెందినదాన్నైనా, నాకు భాష తెలియకున్నా ఎక్కువగా దక్షిణ భారతదేశ చిత్రాలు, డాన్సులు, పాటలు చూస్తూంటాను. అవి నన్నెంతో ఆకర్షిస్తాయి. ఆ పాటలు చూస్తుంటే అందులో నేనే హీరోయిన్ అయిట్లుగా ఫీలయిన సందర్భాలెన్నో. ఈ అవకాశంతో నా కల నిజమైనందుకు ఆనందంగా ఉంది. దక్షిణాదిలో నాకెన్నో అవకాశాలు వస్తున్నాయి. నటించమని ఎంతోమంది నన్ను సంప్రదిస్తున్నారు అంది.

అలాగే నేను భావావేశాలను నియంత్రించలేను. నా గురించి కొన్ని కొన్ని సంఘటనలను వివరించేటపుడు నాకు తెలియకుండానే కన్నీళ్లొస్తాయి. నేనెంతో కష్టపడి ఈ స్థితికి వచ్చాను. అదృష్టం వల్ల రాలేదు.ఎంతో మంది అమ్మాయిలు సినిమాల్లో నటించాలని కలలు కంటుంటారు. నేనలాంటి పాత్రనే ఈ కన్నడ చిత్రంలో పోషిస్తున్నాను. నేనీ చిత్రాన్ని ఒప్పుకోగానే నా తలిదండ్రులు, దగ్గర బంధువులు, స్నేహితులు ఎంతో ఉత్కంఠకు లోనయ్యారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X