షాకింగ్ సీన్ : రోడ్డు పక్కన నగ్నంగా వీణామాలిక్!
ముంబై : పాకిస్థానీ భామ వీణా మాలిక్ మరోసారి తన నగ్న అందాలతో సంచలనం సృష్టించింది. గతంలో ఎఫ్.హెచ్.ఎం మేగజైన్ కోసం ఒంటిపై నూలు పోగు కూడా లేకుండా దర్శనం ఇచ్చి ప్రపంచం దృష్టిని తన వైపుకు తిప్పుకున్న వీణా మాలిక్ అలా వచ్చిన పబ్లిసిటీతో బాలీవుడ్‌లో సెటిల్ కావడానికి మార్గం సుగమం చేసుకున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్లో 'ముంబై 125 కి.మి' అనే చిత్రంలో నటిస్తోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలైంది. ఈచిత్రంలో వీణా మాలిక్ రోడ్డు పక్కన మైలురాయిపై నగ్నంగా దర్శనం ఇవ్వడం సర్వత్రా చర్చనీయాంశం అయింది. హారర్ నేపథ్యంలో రూపొందుతున్న ఈచిత్రంలో వీణా మాలిక్ పాత్ర...రోడ్డు పక్కన నగ్నంగా కూర్చుని ఆ దారిలో పోయే వారిని తన అందాలతో ఆకర్షించి చంపేస్తుందని స్పష్టం అవుతోంది.
దర్శకుడు హేమంత్ మధుకర్ నిర్మాణ దర్శకత్వంలో ఈచిత్రం రూపొందుతోంది. తెలుగు సంగీత దర్శకుడు మణిశర్మ ఈ చిత్రానికి సహ నిర్మాతగా, సంగీత దర్శకుడిగా వ్యవహరించడం గమనార్హం. ఫిబ్రవరి 8, 2013లో ఈచిత్రం విడుదల కానుంది. ఈ చిత్రం గ్లామర్ పరంగా తనకు మంచి పేరుతెస్తుందనే వీణా మాలిక్ నమ్మకంతో ఉంది.
ఇక వీణా మాలిక్ తెలుగులో నటిస్తున్న నగ్న సత్యం సినిమా విషయానికొస్తే...అనురాధా ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు. చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించారు.


Click it and Unblock the Notifications












