షాకింగ్: అతని వల్ల ఆ హీరోయిన్ గర్భవతి అయిందా?
ముంబై: దుబాయ్‌కి చెందిన వ్యాపార వేత్త అసద్ బషీర్ ఖాన్‌ను పెళ్లాడి ఎంతో సంతోషంగా ఉన్న బాలీవుడ్ నటి వీణా మాలిక్‌కు....అతని మాజీ బాయ్ ఫ్రెండ్ నుంచి ఊహించని షాకింగ్ ట్విస్ట్ ఎదురైంది. ఆమె వేరొకరిని పెళ్లి చేసుకోవడంపై తీవ్ర మనస్థాపంతో ఉన్న ఆమె మాజీ బాయ్ ఫ్రెండ్ ప్రశాంత్ ప్రతాప్ సింగ్ సెన్సేషన్ విషయాలు లీక్ చేసాడు. తన వల్ల వీణా మాలిక్ గర్భవతి అయిందని ఆయన చెప్పుకొచ్చాడు. తనకు చెప్పకుండా వీణామాలిక్ దుబాయ్ వెళ్లి పెళ్లి చేసుకుందని అసంతృప్తి వ్యక్తం చేసాడు.
తామిద్దరం సీరియస్‌గా సహజీవనం చేసామని, తన వల్ల వీణా మాలిక్ గర్భం దాల్చిందని, ఆ సమయంలో పిల్లల బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేక ఇద్దరి అంగీకారంతో అబార్షన్ చేయించామని తెలిపాడు. ప్రశాంత్ ప్రతాప్ సింగ్ చేసిన వ్యాఖ్యలు ఇపుడు బాలీవుడ్లో చర్చనీయాంశం అయ్యాయి.

అంతే కాకుండా....వీణా మాలిక్ నుంచి తనకు బెదిరింపులు మొదలయ్యాయని ముంబై పోలీసులకు తెలిపాడు. తమ మధ్య ఉన్న సంబంధం గురించి మీడియాకు లీక్ చేస్తే రేప్ కేసు పెడతానని వీణా మాలిక్ బెదిరిస్తోందని ప్రశాంత్ ప్రతాప్ సింగ్ చెప్పుకొచ్చాడు. మే 10, 2012న తన వల్ల వీణా మాలిక్ గర్భవతి అయిందని, అబర్షన్ చేయించుకున్న తర్వాత కన్నడ మూవీ 'డర్టీ పిక్చర్-సిల్క్ సక్కత మగా' షూటింగులో పాల్గొందని అతను తెలిపాడు.
అయితే ప్రశాంత్ ప్రతాప్ సింగ్ ఆరోపణలను వీణా మాలిక్ ఖండించింది. ప్రశాంత్ ప్రతాప్ సింగ్ తన వద్ద పని చేసే వాడని, అతనికి రూ. 10,000 జీతం కూడా ఇచ్చేదాన్నని వీణా మాలిక్ తెలిపారు. అతని ఆరోపణలు విని తన భర్త పగల బడి నవ్వాడని వీణా మాలిక్' చెప్పుకొచ్చింది.


Click it and Unblock the Notifications











