Don't Miss!
- News తిరుపతిలో నామినేషన్ల వేళ.. టీడీపీ, వైసీపీ వర్గీయుల రాళ్ళదాడి; పోలీసుల లాఠీచార్జ్; ఉద్రిక్తత!!
- Sports IPL 2024: అప్పుడు కావ్య పాపను చూసి నవ్వుకున్నారు.. ఇప్పుడు ఆమె నవ్వుతోంది!
- Technology యూట్యూబ్‌కు పోటీగా TV యాప్.. ఫీచర్లు, అల్గారిథమ్ పైన X సీఈవో ఏమన్నారంటే.. ?
- Lifestyle టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారనడానికి ఇవే సంకేతాలు.. ?
- Finance Stock Market Close: భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
రెడ్ మిర్చీగా వీణా మాలిక్.. మరీ నాటుగా ఘాటుగా.. 150 రోజులు.. 25 కోట్లు!
Recommended Video
పాకిస్థాన్ హీరోయిన్ వీణా మాలిక్ బిగ్ బాస్ హిందీ 4వ సీజన్ రియాల్టీ షో ద్వారా టెలివిజన్ రంగంలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత వీణా మాలిక్ బాలీవుడ్లో సినిమా అవకాశాలు దక్కించుకుంది. జిందగీ 50-50, డర్టీ పిక్చర్ (కన్నడ), సూపర్ మోడల్, 'ముంబై 125 కి.మీ' లాంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో నగ్న సత్యం అనే చిత్రంలో నటించింది. దుబాయ్‌కి చెందిన వ్యాపారవేత్త అసద్ బషీర్‌ను పెళ్లాడింది. అప్పటి నుంచి సినిమాలకు దూరంగా ఉంది.
28న రెడ్ మిర్చి రిలీజ్
కన్నడలో సిల్క్ అనే పేరుతో వచ్చిన చిత్రంలో వీణా మాలిక్ నటించింది. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిన రెడ్ మిర్చీ చిత్రాన్ని తెలుగులో ‘రెడ్ మిర్చీ' పేరుతో.. పి.వి.యన్ సమర్పణలో నైన్ మూవీస్ సంస్థ అందిస్తోంది. సెప్టెంబర్ 28న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్ తెలుగు ప్రేక్షకులకు అందించనున్నారు.
సెన్సార్ చిక్కులను అధిగమించి
ఈ సందర్భంగా నిర్మాత కరణ్ మాట్లాడుతూ.. ‘‘కన్నడ చిత్ర సీమలో సెన్సేషనల్ విజయంతో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిచిన ఈ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సెన్సార్ చిక్కులను అధిగమించిన మా ‘రెడ్ మిర్చీ'ని సెప్టెంబర్ 28న విడుదల చేయబోతున్నాము. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందని ఎంతో నమ్మకంతో ఉన్నాం.. '' అన్నారు.
కన్నడలో బ్లాక్ బస్టర్
కన్నడలో తెరకెక్కిన ‘సిల్క్' చిత్రం.. కన్నడ సినీ చరిత్రలో కొత్త రికార్డులను నెలకొల్పి, 25 కోట్లు వసూలు చేయడమే కాకుండా, 150 రోజులు విజయవంతంగా ప్రదర్శించబడింది. తెలుగు ప్రేక్షకులకు అందించాలన్న ఉద్దేశంతో ఈ చిత్రాన్ని డబ్ చేశాం అని పేర్కొన్నారు.
నటీనటులు, సాంకేతిక వర్గం
వీణామాలిక్, అక్షయ్ జంటగా నటించిన ఈ చిత్రంలో సన, షఫీ, సాదుకోకిల, అవినాష్ మొదలగువారు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: జెస్సీగిఫ్ట్స్, కెమెరా: జైఆనంద్, ఎడిటర్: సంజీవరెడ్డి, మాటలు,పాటలు: భారతీబాబు, సమర్పణ: పి.వి.యన్, విడుదల: యం.జి.యం డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాత: కరణ్, దర్శకత్వం: త్రిశూల్.