Don't Miss!
- News టీడీపీ గెలుపు కష్టమే.. ఎంపీ అభ్యర్థి అభ్యర్థి లావు కృష్ణ దేవరాయలు షాకింగ్ కామెంట్స్
- Technology ఫిజికల్ బటన్ లు లేకుండా రానున్న iPhone 16 ! డిజైన్ వివరాలు లీక్
- Automobiles 2024 Jeep Wrangler Facelift Review Video జీప్ రాంగ్లర్ ఫేస్‌లిఫ్ట్ ఆఫ్రోడర్ ఫుల్ రివ్యూ వీడియో
- Finance ITC: ఐటీసీ ఇన్వెస్టర్లకు శుభవార్త.. !
- Sports చరిత్ర సృష్టించిన అక్షర్ & పంత్ క్రేజీ రికార్డు
- Lifestyle చింత చిగురు పప్పు: నోట్లో నీళ్ళు ఊరాల్సిందే.. వాసనకు కడుపు నిండాల్సిందే..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
సిల్క్ స్మితగా...న్యూడ్ లేడీ
టాప్ లెస్‌గా, న్యూడ్ ఫోజులతో పలు మేగజైన్లపై దర్శనం ఇచ్చి బాగా పాపులారిటీ సంపాదించిన పాకిస్థాన్ భామ వీణా మాలిక్ ఇప్పడు పలు బాలీవుడ్ సినిమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఈ న్యూడ్ లేడీ దక్షిణాది సినిమాల్లో కూడా తెరంగ్రేటం చేసేందుకు సిద్ధం అవుతోంది.
సిల్క్ స్మిత జీవితం ఆధారంగా బాలీవుడ్లో రూపొందిన 'డర్టీ పిక్చర్' చిత్రం మంచి విజయం సాధించింది. అయితే విద్యాబాలన్‌కు దక్షిణాదిన క్రేజ్ లేక పోవడంతో ఇక్కడ సినిమా సరిగా ఆడలేదు. ఈ నేపథ్యంలో దక్షిణాదిన ఉన్న పలు భాషల్లో ఈచిత్రాన్ని రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కన్నడ రీమేక్‌లో వీణా మాలిక్‌ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ పాత్రకు నిఖిత, ఛార్మి, పూజా గాంధీలను సంప్రదించినా...వారు బెల్డ్ గా ఎక్స్ ఫోజింగ్ చేయడానికి సుముఖంగా లేక పోవడంతో వీణా మాలిక్‌ను ఈ ఆఫర్ వరించినట్లు సాండల్ వుడ్ టాక్.
ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో వార్తల్లో ఉండే వీణా...మూవర్స్ అండ్ షేకర్స్ కార్యక్రమంలో మాట్లాడుతూ...వీణాకా వివాహ్ రియాల్టీ షోలో బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ లాంటి లక్షణాలున్న వ్యక్తిని భర్తగా పొందేందుకు వేట ప్రారంభించానని, నాకు కాబోయే వాడికి గంభీరమైన గొంతు, అందంగా ఉంటే మిగతా విషయాలలో సర్దకు పోతానని చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ లో రాణించాలనే ఉద్దేశ్యంతో పబ్లిసిటీ పెంచుకోవడంలో భాగంగానే వీణా మాలిక్ నూలు పోగు కూడా లేకుండా తెగించింది. ఆమె ఊహించినట్లే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్లో 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.