స్వలింగ సంపర్కానికి... ఆమె ఓకే

By Bojja Kumar

veena malik
స్వలింగ సంపర్కం అంటే సాధారణంగా సమాజంలో చాలా మంది చీదరించుకునే అంశం. అయితే బాలీవుడ్ హాట్ లేడీ వీణా మాలిక్ మాత్రం తాను హోమోసెక్సువాలికి సపోర్టు ఇస్తానంటోంది. ఆడ-ఆడ...మగ-మగ సెక్సు చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం తప్పేమీ కాదని, వారిని వ్యతిరేకించడం అంటే వారి వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంటోంది.

అమెరికా అధ్యక్షుడు ఒబామా, ప్రముఖ హాలీవుడ్ తారలు కూడా స్వలింగ సంపర్కానికి మద్దతు తెలుపుతున్నారని, ఇతరులకు హానికలిగించనంత వరకు ఈ ప్రపంచంలో ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు బ్రతికే స్వేచ్ఛ ఉందని, వారి మనోభావాలను అడ్డుకోవడం, వారిని అసహ్యించుకోవడం సరికాదని అంటోంది వీణా మాలిక్.

ఇండియాలో పాపులారిటీ పెంచుకోవడమే లక్ష్యంగా ఆ మధ్య బరితెగించి ఎఫ్‌హెచ్‌ఎం మేగజైన్‌పై ఒంటిపై నూలు పోగు లేకుండా నగ్నంగా దర్శనం ఇచ్చిన వీణా మాలిక్...ఇప్పుడు బాలీవుడ్ అవకాశాలు బాగానే దక్కించుకుంటోంది. ఆమె ఊహించినట్లే ఆ తర్వాత పలు బాలీవుడ్ అవకాశాలు కూడా ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ప్రస్తుతం వీణా మాలిక్ బాలీవుడ్‌లో 'జిందగి 50-50' అనే చిత్రంలో నటిస్తోంది. రాజీవ్ రుయా దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రంలో వీణా సెక్స్ వర్కర్ పాత్రలో నటిస్తోంది. ఇందులో ఓ సీన్లో పూర్తి నగ్నంగా నటిస్తోందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

విద్యాబాలన్ నటించిన 'ది డర్టీ పిక్చర్' 114 కోట్లు వసూలు చేసి బాలీవుడ్ బాక్సాఫీస్‌ని షాక్ అయ్యేలా చేసిన సంగతి తెలిసిందే. సిల్స్ స్మిత జీవతం ఆధారంగా రూపొందిన ఈ చిత్రం తరహాలో మరో చిత్రం కన్నడంలో రూపొందుతోంది. పాకిస్దాన్ శృంగార నటి వీణా మాలిక్ నటిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సినిమా పేరు 'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌హాట్‌మగ'. సిల్క్ స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం 'ది డర్టీ పిక్చర్' నకలు అని ప్రచారం జరుగుతోంది. అయితే వీణా మాలిక్ దీన్ని కొట్టిపారేస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X