twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో వీణా మాలిక్‌ 'నగ్నసత్యం'

    By Srikanya
    |

    హైదరాబాద్: పాకిస్థాన్‌కి చెందిన వివాదాస్పద నటి వీణా మాలిక్‌ త్వరలో తెలుగు తెరను వేడిక్కించనుంది. శృంగారపరమైన పాత్రలు పోషించే ఆమె తెలుగులో నటించే చిత్రం టైటిల్ 'నగ్నసత్యం'. అనురాధా ఫిలిమ్స్‌ పతాకంపై చదలవాడ శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తారు. రామారావు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ నెల 10న చిత్రీకరణ మొదలవుతుంది. సమర్పణ: చదలవాడ తిరుపతిరావు.

    చదలవాడ శ్రీనివాసరావు గతంలో అన్నావదిన, రిక్షారుద్రయ్య, వార్నింగ్, ప్రేమించాను నిన్నే చిత్రాలను నిర్మించిన విషయం తెలిసిందే. పదహారేళ్ల విరామం తర్వాత చదలవాడ శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రమిది. దర్శకుడు పి.చంద్రశేఖరరెడ్డి శిష్యుడైన రామారావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. అనూరాధ ఫిలింస్ పతాకంపై రూపొందనుంది.

    పాక్‌ నుంచి ముంబైకి చేరుకొని హిందీ చిత్రాల్లో నటిస్తోంది. కన్నడంలో సిల్క్‌స్మిత జీవితం ఆధారంగా రూపొందుతున్న ఓ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించింది. అందాల ఆరబోతలో ఏ మాత్రం సందేహించని వీణా మాలిక్‌ అనేక వివాదాల్లో చిక్కుకుంది. విద్యాబాలన్‌కు జాతీయ అవార్డు తెచ్చిన చిత్రంలో నటించడానికి సూపర్‌ ఎక్సైట్‌మెంటుతో సంతకం చేశానని అంటోంది ముద్దుగుమ్మ. ఎఫ్ మ్యాగజైన్ ముఖచిత్రం పాకిస్ధాన్ ఆర్మీ దుస్తులతో సెక్సీ ఫోజులిచ్చిన అమ్మడు తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. పాక్ లో అమ్మడికి మతపెద్దలు కూడా తలంటారు. ఇటీవల ఇమ్రాన్ ఖాన్ అధ్యక్షుడిగా ఉన్న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించింది. ఇప్పడు దక్షిణాది డర్టీపిక్చర్ కు చేసి హాట్ టాపిక్ గా మారింది.

    'డర్టీ పిక్చర్‌.. సిల్క్‌ సకత్‌ హాట్‌ మగ' సినిమా విడుదల తరువాత తన రాత మారిపోతుందని వీణామాలిక్‌ చెప్పారు. ఈ సినిమా ఫోటో షూట్‌కోసం బెంగళూరు వచ్చిన ఆమె మీడీయాతో మాట్లాడారు. 'డర్టీ పిక్చర్‌...' విడుదల తరువాత ప్రేక్షకులు అందులో తన పాత్రను మరచిపోరన్నారు. తాను హిందీ 'డర్టీ పిక్చర్‌'ను చూడలేదని ఒక ప్రశ్నకు బదులిచ్చారు. అయితే అందులో నటించిన విద్యాబాలన్‌ కంటే తన నటన ఇంకా గొప్పగా ఉంటుందని మాత్రం చెప్పగలనన్నారు. సిల్క్‌ స్మిత జీవితం గురించి చదివానని తెలిపారు.

    English summary
    Pakistani starlet Veena Malik is finally making her tollywood debut with a film titled Nagna Satyam.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X