twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    వీణా మాలిక్...1 నిమిషయంలో 100 లిప్‌లాక్ ముద్దులు

    By Bojja Kumar
    |

    ముంబై : పాకిస్థాన్ బ్యూటీ వీణా మాలిక్ తన పుట్టిన రోజు వేడుకను విచిత్రంగా, వైవిధ్యంగా, ప్రపంచం మొత్తం చర్చించుకునే విధంగా జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఇందుకు తన అందచందాలను పెట్టుబడిగా పెడుతోంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఒక నిమిషయంలో 100కుపైగా లిప్ లాక్ ముద్దులు పెట్టి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి సరికొత్త రికార్డు సృష్టించాలని నిర్ణయించుకుంది.

    మరి వీణా మాలిక్ ఎవరిని ఇన్ని సార్లు ముద్దు పెట్టుకోబోతోంది? ఈ అదృష్ణం ఎవరికి దక్కబోతోంది? అనుకుంటున్నారా..! ఈ అవకాశం 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' మూవీ కాంటెస్టెంట్స్‌కు మాత్రమే ఈ అవకాశం దక్కబోతోంది. 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' అనేది వీణా మాలిక్ రాబోయే బాలీవుడ్ చిత్రం. బాలీవుడ్ హంట్ అనే కార్యక్రమం ద్వారా ఈ చిత్రంలో వీణా మాలిక్ సరసన పర్ ఫెక్ట్ గా సూటయ్యే హీరోను ఎంపిక చేయబోతున్నారు.

    దీని గురించి వీణా మాలిక్ మాట్లాడుతూ ''ఈ కార్యక్రమం చేపడుతున్నందుకు ఎంతో ఎగ్జైటెడ్ గా ఉంది, 100 ముద్దులతో గిన్నిస్ రికార్డు బద్దలు కొట్టాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాను. దీన్ని ఈ రోజుకు పొందే పెద్ద బహుమతిగా భావిస్తున్నారు. 'ది సిటీ దట్ నెవర్ స్లీప్' కంటెస్టెంట్స్...రండి నన్ను ముద్దు పెట్టుకోండి. ఇలాంటి అవకాశం కల్పించిన నిర్మాత సతీష్ రెడ్డి, దర్శకుడు హరూన్ రషీద్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను'' అంటూ వీణా మాలిక్ వెల్లడించింది.

    మరి ఈ సెక్సీ బ్యూటీని ముద్దు పెట్టుకునే అవకాశం దక్కించుకోబోతున్న ఆ అదృష్ణ వంతులెవరో మరి కొన్ని గంటల్లో తేలబోతోంది. వీణా మాలిక్ నటిస్తున్న ఇతర సినిమాల వివరాల్లోకి వెళితే....ప్రస్తుతం ఆమె ది డర్టీపిక్చర్ సిల్క్ సక్కత్ హాట్ మగ అనే కన్నడ చిత్రంలో, సూపర్ మోడల్, జిందగీ 50-50, ముంబై 125కి.మీ అనే బాలీవుడ్ చిత్రాల్లో, తెలుగులో నగ్నసత్యం అనే మరో చిత్రంలో నటిస్తోంది.

    English summary
    
 Veena Malik is going to celebrate her birthday in a unique style. She will lock lips 100 times in one minute to break the existing most number of Kissing Guinness book of world Records. The contestants of “The City that Never Sleeps-Bollywood Hunt” will kiss Veena Malik on the occasion of her Birthday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X