బద్రినాథ్ కు రవితేజ భయపడుతున్నాడనేది కాదనలేని నిజం..
అల్లు అర్జున్ నటించిన తాజా చిత్రం 'బద్రినాథ్". సోషియో ఫాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం లో అర్జున్ యోధునిగా కనిపించనున్నాడు. రెగ్యులర్ చిత్రాలకు భిన్నంగా రూపొందిన ఈ చిత్రానికి వినాయక్ దర్శకుడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన స్టిల్స్, ట్రైలర్స్ అందరిలోనూ ఆసక్తిని పెంచాయి. ఇటీవల ఆడియో విడుదల చేసుకున్న ఈ చిత్రం ఈ నెలాఖరులో ప్రేక్షకుల ముందుకు రానుంది.
కాగా రవితేజ నటిస్తున్న 'వీర" మొదట్నుంచీ కాస్త నెమ్మదిగానే షూటింగ్ జరుపుకున్నా..ఇప్పుడు బద్రినాథ్ కంటే ముందుగా ప్రేక్షకుల ముందుకు రావాలని అహోరాత్రులు శ్రమిస్తున్నారు వీర చిత్ర యూనిట్. ఈ నెల 19న లేక 20న చిత్రాన్ని విడుదల చేస్తే కనీసం బద్రినాథ్ కంటే ఓ వారం ముందు తీసుకొచ్చినట్టుగా వుంటుందని, దాని వల్ల తమ సినిమా ఓ వారం సోలోగా బాక్సాపీస్ కలెక్షన్లు కొల్లగొడుతుందని వీర దర్శక నిర్మాతల ఆలోచన. అయితే పేరుకు వీర అనే టైటిల్ తో వస్తున్నా..బద్రినాథ్ కు రవితేజ భయపడుతున్నాడనేది కాదనలేని నిజం..


Click it and Unblock the Notifications











