రవితేజ వీర సినిమాలో అభ్యంతరకర దృశ్యాలు, రీళ్ల స్వాధీనం
రవితేజ హీరోగా నటించిన వీర సినిమా ప్రదర్శనకు బ్రేకులు పడ్డాయి. హైదరాబాదులోని ఓడియన్ థియేటర్‌లో వీర సినిమా ప్రదర్శన నిలిచిపోయింది. సినిమాలో అభ్యంతరకర దృశ్యాలను ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వచ్చాయి. దాంతో సెన్సార్ బోర్డు సినిమా రీళ్లను స్వాధీనం చేసుకుంది. వీర సినిమాలో రవితేజ సరసన తాప్సీ, కాజల్ అగర్వాల్ నటించారు. రమేష్ వర్మ సినిమాకు దర్శకత్వం వహించారు.
వీర సినిమా మే 20వ తేదీన విడుదలైంది. సినిమాలో హీరో రవితేజ అకస్మాత్తుగా ఓ ఇంట్లోకి చొరబడి అందరి అభిమానాన్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తాడు. గణేష్ ఇందుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. సెన్సార్ చేసిన దృశ్యాలను కూడా ప్రదర్శిస్తున్నారనేది సెన్సార్ బోర్డు ప్రధాన ఆరోపణ.


Click it and Unblock the Notifications











