మన కుర్రాళ్లే...అంటున్న పవన్ కళ్యాణ్ డైరెక్టర్

By Bojja Kumar

హైదరాబాద్: పవన్ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కిన ‘గుడుంబా శంకర్' చిత్రానికి దర్శకత్వం వహించిన వీర శంకర్‌ ఆ సినిమా తర్వాత టాలీవుడ్లో కనిపించకుండా పోయాడు. చాలా కాలం తర్వాత మళ్లీ వార్తల్లో వ్యక్తిగా మారాడు. ఈ సారి ఆయన ‘మన కుర్రాళ్లే' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

అరవింద్ కృష్ణ, రాజ్‌కల్యాణ్, ప్రగతి ప్రధాన పాత్రధారులుగా వీరశంకర్ సిల్వర్ స్క్రీన్స్ పతాకంపై ‘మన కుర్రాళ్లే' (ది లేటెస్ట్ జనరేషన్) చిత్రం తెరకెక్కుతోంది. వీరశంకర్ దర్శకత్వంలో బి.వి.ఎస్.శ్రీనివాసు, హారూన్.హెచ్.ఎస్. నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. సినిమా గురించి దర్శకుడు వీరశంకర్ మాట్లాడుతూ- సమాజంలో అనేక సంఘటనలు మన చుట్టూ జరుగుతూనే వుంటాయి. వాటి ఆధారంగా కథను రూపొందించుకొని ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తాను నిర్మించానని, సహకరించినవారందరికీ ధన్యవాదాలని, తప్పనిసరి పరిస్థితుల్లో తానే నిర్మాతగా మారి నిర్మించిన ఈ చిత్రం ఓ మంచి కార్యంకోసం మొదలుపెట్టిందని, ప్రేక్షకుల అందరికీ నచ్చుతుందని తెలిపారు.

Veera Sankar new movie 'Mana Kurralle'

పట్నంలో బ్రతుకుదామని వచ్చిన కొంతమంది కుర్రాళ్ళు వాళ్ళ గ్రామంలో వచ్చిన సమస్యను ఎలా ఎదుర్కొన్నారు, చివరికి ఎలా విజయం సాధించారు అన్న కథాంశంతో కెమెరా పనితనం, డైలాగ్స్ హైలెట్‌గా నిలిచే ఈ చిత్రం తప్పక విజయవంతం అవుతుందని కథానాయకుడు అరవింద్ కృష్ణ తెలిపారు.

కృష్ణుడు, వెంకట్, రావూ రమేష్, కృష్ణ్భగవాన్, వేణుమాధవ్, ఎం.ఎస్.నారాయణ, శ్రీనివాసరెడ్డి, సమ్మెట గాంధీ, రచనా మల్హోత్ర, శృతిరాజ్, బెంగుళూరు పద్మ తదితరలు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ముజీర్ మాలిక్, సంగీతం:రాజ్ గురుకిరణ్, మనోమూర్తి, జి.కె., శివ కాకాని, మురారి జయన్, భీమ్స్, మాటలు:వికర్ణ, మధుగూటి, ఎడిటింగ్:బస్వా పైడిరెడ్డి, నిర్మాతలు:బి.వి.ఎస్.శ్రీనివాసు, హారూన్ హెచ్.ఎస్., దర్శకత్వం:వీరశంకర్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X