మాధవన్,జగపతి బాబు కాంబినేషన్....

By Staff

Jagapati Babu
మల్టి స్టార్ సినిమా అంటే వెంటనే గుర్తుకు వచ్చే హీరో జగపతి బాబు. యే ఇగోలు లేకుండా చక్కగా ఇమిడిపోయి నటించే ఈ నటుడు ప్రస్తుతం 'కథానాయకుడు' చిత్రంలో రజనీ కాంత్ బాల్య మిత్రుడుగా చేస్తున్నాడు. గతంలోనూ 'లక్ష్యం' ,'శివకాశి' , 'అనుకోకుండా ఒకరోజు' వంటి చిత్రాల్లో వేరే హీరోలతో చేసారు. అలాగే ఇప్పుడాయన 'గుడుంబాశంకర్' ఫేమ్ వీర్ శంకర్ దర్శకత్వంలో నటించబోతున్నాడు.

ఆ సినిమాలో ఆయనతో పాటు మాధవన్ కూడా చేస్తున్నాడు. ఇలా కథలకు ప్రిఫెరన్స్ ఇస్తూ కెరీర్ లో ముందుకు వెళ్తున్న జగపతి వర్మ నిర్మించే 'రక్ష' లోనూ విభిన్నమైన పాత్ర చేసారని తెలుస్తోంది. చేతబడి చుట్టూ నడిచే ఆ కథ ఓ మంచి అనుభూతి అని ఆయన ఫీలవుతున్నారు. పాత్రలకి ప్రాధాన్యత ఇస్తున్నాడు కాబట్టే మిగతా హీరోలకు దొరకని కథలు ఆయనని వెతుక్కుంటూ వస్తున్నాయని సీనియర్లు మెచ్చుకుంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X