Don't Miss!
- News
స్మితా సబర్వాల్ ఇంట్లోకి ప్రవేశించిన డిప్యూటీ తహసీల్దార్‌పై వేటు పడింది!
- Finance
Vistara: రికార్డు సృష్టించిన విస్తారా ఎయిర్ వేస్.. కంపెనీ పెట్టాక తొలిసారిగా..
- Lifestyle
Republic Day 2023: పిల్లల కోసం రిపబ్లిక్ డే స్పీచ్ ఐడియాలు.. ఈ టిప్స్ పాటిస్తే ప్రైజ్ మీదే
- Sports
KL Rahul : ప్రేయసికి మూడు ముళ్లు వేయనున్న రాహుల్.. ఐపీఎల్ తర్వాత భారీగా రిసెప్షన్!
- Automobiles
భారత్‌లో Aura ఫేస్‌లిఫ్ట్ విడుదల చేసిన హ్యుందాయ్: ధర & వివరాలు
- Technology
స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ & ఎలక్ట్రానిక్ గాడ్జెట్లపై రిపబ్లిక్ డే ఆఫర్లు!
- Travel
రాయలసీమలో దాగిన రహస్యాల మూట.. గుత్తి కోట!
వీరసింహారెడ్డికి 2000 కోట్లు.. ఫ్యాన్స్ మధ్యలో గొడవ.. కూల్ డ్రింక్ బాటిలో పట్టుకొని థియేటర్లో ట్విస్ట్!
నందమూరి బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమా గురువారం రోజు భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాకు ఊహించని విధంగా టాక్ అయితే వినిపిస్తోంది. ఇక వీరసింహారెడ్డి సినిమా ఎలా ఉన్నా కూడా ఓపెనింగ్స్ అయితే ఊహించని స్థాయిలోనే ఉంటాయని కూడా అనిపిస్తుంది. అయితే సినిమా ధియేటర్లో ఇద్దరు ఫ్యాన్స్ మధ్యలో జరిగిన గొడవ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

బాలయ్య సినిమాకు సాలీడ్ ఒపెనింగ్స్
నందమూరి బాలకృష్ణ ద్విపత్రాభినయం చేసిన వీర సింహ రెడ్డి సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా ఈ సినిమాను భారీగానే విడుదల చేశారు. ఇక విడుదలకు ముందే ట్రైలర్స్ సాంగ్స్ ద్వారా మంచి అంచనాలను క్రియేట్ చేసుకున్న వీర సింహారెడ్డికి బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ అందుతున్నాయి.

విభిన్నమైన టాక్
ఇక నందమూరి బాలకృష్ణను దర్శకుడు గోపీచంద్ మలినేని ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని అనుకుంటున్నారో అదే తరహాలో ప్రజెంట్ చేసినట్లుగా చెప్పుకొచ్చారు. అయితే మొదటి షో చూసిన ఫ్యాన్స్ మాత్రం కొందరు చాలా అద్భుతంగా ఉంది అని పాజిటివ్ గా స్పందిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సినిమా అంచనాల స్థాయిని అందుకోలేదు అని సెకండ్ హాఫ్ అంతగా బాగోలేదు అని కూడా మరి కొందరు కామెంట్ చేస్తున్నారు.

రెండు వేల కోట్లు అంటూ..
అయితే సినిమాను చూసిన ఫ్యాన్స్ మీడియా ముందు ఏ విధంగా హడావుడి చేస్తారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక రీసెంట్ గా ఒక ఫ్యాన్ కూడా వీరసింహారెడ్డి ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత మీడియా ముందు తన మాటలతో ఫోకస్ అయ్యే ప్రయత్నం చేశాడు. సినిమా అద్భుతంగా ఉంది అని జై బాలయ్య అంటూ ఈ సినిమా తప్పకుండా 2000 కోట్లు కలెక్షన్స్ అందుకుంటుంది అని మైకుల ముందు తనకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేశాడు.

చెత్తగా ఉందంటూ
అయితే
అతను
ఆ
విధంగా
వేల
కోట్లు
కలెక్షన్స్
సాధిస్తుంది
అని
మాట్లాడడంతో
పక్కనే
నుంచి
మరొక
ఫ్యాన్
వచ్చి
అతనికి
కౌంటర్
ఇచ్చే
ప్రయత్నం
చేశాడు.
సినిమా
చాలా
చెత్తగా
ఉంది
అంటూ
అసలు
బాగోలేదు
అని
అనడంతో
ముందు
మాట్లాడిన
ఫ్యాన్
కోపంగా
చూశాడు.
ఏంటి
చూస్తున్నావు
అని
ఇద్దరి
మధ్య
కొంత
సైలెంట్
వార్
కొనసాగింది.
ఇక
సెకండ్
హాఫ్
బాగుంటుంది
అని
కూడా
అతను
సర్ది
చెప్పే
ప్రయత్నం
చేశాడు.
కానీ
సినిమా
బాగోలేదు
అని
ఆ
అభిమాని
అనడంతో
అతనికి
కొంత
ఆగ్రహం
వచ్చింది.
|
లోపల ఏం జరిగింది?
ఇక ఇద్దరి మధ్యలో గొడవ వాతావరణం కనిపించింది. ఇక కౌంటర్ ఇచ్చిన ఫ్యాన్ అయితే మెల్లగా థియేటర్లోకి వెళ్ళిపోతూ ఉండగా మైకులో ముందు మాట్లాడిన వ్యక్తి ఒక్క నిమిషం అంటూ పక్కనే ఉన్న మరొక థమ్స్ అప్ బాటిల్ పట్టుకుని లోపలికి వెళ్ళాడు. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత అతను ఏం చేశాడు అనేది తెలియాలి అని సోషల్ మీడియాలో చాలా రకాల కామెంట్స్ వేలువడుతున్నాయి. కానీ నిజానికి అక్కడ ఏమి జరగలేదు అని చూసినవాళ్లు తెలిపారు.