విక్రమ్ రాథోడ్ ను తలపిస్తోన్న మాస్ మహారాజా రవితేజ ‘వీర'
రాజమౌళి దర్శకత్వంలో రవితేజ సూపర్ హిట్ మూవీ అయిన 'విక్రమార్కుడు"లో ద్విపాత్రాభినయం చేశాడు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంత పెద్ద హిట్టైందో అందరికీ తెలిసిన విషయమే. విక్రమార్కుడులో అత్తిలిసత్తిబాబు, విక్రమ్ రాథోడ్ పాత్రలో మాస్ రాజా రవితేజల్ అధ్బుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకొన్న రవితేజ మళ్ళీ ఇప్పుడు 'వీర" సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడని సమాచారం.
రవితేజ హీరోగా కాజల్, తాప్సి హీరోయిన్లుగా రమేష్ వర్మ దర్శకత్వంలో గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న 'వీర' చిత్రం ఆడియో రిలీజ్ అయింది. నిన్న(మే 6వ తేదిన)సాయంత్రం హైదరాబాదులోని రామానాయుడు స్టుడియోలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పాటలను చిత్ర సంగీత దర్శకుడు తమన్ విడుదల చేశాడు. ఇందులో ఏడు పాటలు, ఒక బిట్ సాంగ్ వున్నాయి. ఈ చిత్రంలో రవితేజ డ్యుయల్ రోల్ పోషిస్తున్నట్టు తమన్ చెప్పాడు. రెండు పాత్రలూ ప్రేక్షకులని అలరిస్తాయని ఆయన అన్నాడు. నిర్మాతతో సహా చిత్రం యూనిట్ ప్రస్తుతం స్విట్జర్లాండులో పాట చిత్రీకరణలో ఉండడంతో ఆదిత్యా మ్యూజిక్ అధినేత దయానంద్ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెల 19న లేక 20న చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











