రాజకీయ అవినీతి తారస్ధాయి
లయన్ అనే మలయాళ చిత్రం రీమేక్ హక్కులను హీరో రాజశేఖర్ కొనుగోలు చేశారు. మలయాళం నుంచి రాజశేఖర్ కొనుగోలు చేసి నటించిన నాయకుడు సినిమా ఓ మోస్తరుగా ఆడింది. లయన్ మాత్రం తెలుగులో అద్భుతంగా ఆడుతుందన్న నమ్మకంతో జీవిత, రాజశేఖర్ ఉన్నారు. లయన్ రాజకీయాల్లో అవినీతి నిర్మూలనకు సంబంధించిన ఇతివృత్తంతో రూపొందింది. ఒక అవినీతిపరుడైన మంత్రిని అతని కొడుకు రాజకీయాలోకి వచ్చి హోంమినిస్టర్ అయి, ఎలా మంచివాడిగా మార్చాడన్నది సినిమా కథ. రాజకీయ అవినీతి తారస్ధాయిలో ఉన్న ఈ తరుణంలో ఈ సినిమా తెలుగులో బాగా ఆడవచ్చని ట్రేడ్ వర్గాలు కూడా అభిప్రాయపడుతున్నాయి.


Click it and Unblock the Notifications











