ఇటు మహేష్ అటు పవన్, మధ్య బాలకృష్ణ
బాలకృష్ణ వీరభద్ర సినిమా సెన్సార్ ముగిసింది. ఈ సినిమా ఈనెల 29న విడుదల కానున్న విషయం తెలిసిందే. మహేష్‌బాబు పోకిరి ఈనెల 28న, పవన్ కళ్యాణ్ బంగారం మే 3న విడుదల కానున్నాయి. యంగ్ హీరోల సినిమాలతో పాటు తన సినిమాను కూడా విడుదల చేయడానికి బాలకృష్ణ సాహసం చేయడం విశేషం. ఈ సినిమా విడుదలైన మరుసటిరోజే బాలకృష్ణ తాజా చిత్రం ప్రారంభం కానుంది. ఈ సినిమాను పి వాసు దర్శకత్వంలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ సంస్ధ నిర్మిస్తోంది. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మే 4 నుంచి నైనిటాల్‌లో ప్రారంభం కానుంది. స్నేహ, మీరా జాస్మిన్ హీరోయిన్లు. పి వాసు గతంలో బాలకృష్ణ చిత్రం సాహసమే జీవితం చిత్రానికి దర్శకత్వం వహించారు.


Click it and Unblock the Notifications