దొరబాబు ఆఫ్ దుబాయ్..నాగార్జున
హైదరాబాద్ : "హైదరాబాద్‌లో దిగిన తరవాత ఇరానీ చాయ్ రుచి చూడాల్సిందే. భాయ్ గురించి తెలుసుకోవాల్సిందే. ఎవర్నడిగినా భాయ్ గురించి చెప్పేదొక్కటే 'వీడు క్లాసు, వీడు మాసు దొరబాబు ఆఫ్ దుబాయ్..' అని. మరింతకీ అతను చేసేదేంటి? అతని లక్ష్యం ఏంటి? తెలుసుకోవాలంటే మా సినిమా చూడాల్సిందే" అంటున్నారు వీరభద్రమ్. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'భాయ్'. నాగార్జున హీరో. రిచా గంగోపాధ్యాయ హీరోయిన్. అన్నపూర్ణ స్డూడియోస్ సంస్థ తెరకెక్కిస్తోంది. శుక్రవారం 'భాయ్' టీజర్‌ని విడుదల చేస్తారు.
ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎన్.సాయిబాబు మాట్లాడుతూ ''నాగార్జున ఈ సినిమాలో కొత్తగా కనిపిస్తారు. మాస్‌నీ, క్లాస్‌నీ మరోసారి తప్పకుండా అలరిస్తారు. ఇటీవల భాయ్ తొలి ప్రచార చిత్రాన్ని విడుదల చేశాం. దానికి మంచి స్పందన వస్తోంది. టీజర్‌ని శుక్రవారం సాయంత్రం ఎనిమిది గంటలకు నేరుగా యూట్యూబ్‌లో విడుదల చేస్తాం. సెప్టెంబరు 1న పాటల్ని, అదే నెలలో సినిమానీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము'' అన్నారు.
నాగార్జున మాట్లాడుతూ.... ఇందులో నా పాత్రకు మూడు లుక్స్ ఉంటాయి. హాంకాంగ్‌లో డాన్‌కి రైట్ హ్యాండ్‌గా పనిచేసేటప్పుడు ఓ లుక్, పాతబస్తీకి పనిమీద వచ్చినప్పుడు ఓ లుక్, ఎప్పుడో విడిపోయిన ఫ్యామిలీని కలుసుకున్నప్పుడు మరో లుక్ ఇందులో ఉంటుంది అంటూ నాగార్జున తన తాజా చిత్రం భాయ్ లో తను కనపడే విధానం గురించి చెప్పుకొచ్చారు.
నథాలియా కౌర్ ఓ ప్రత్యేక గీతంలో కనిపించనుంది. కామ్నా జెఠ్మలానీ, హంసానందిని, సోనూసూద్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, షాయాజీ షిండే, ఆదిత్యమీనన్, రాహుల్‌దేవ్, వెన్నెల కిషోర్ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సమీర్ రెడ్డి, మాటలు : సందీప్, రత్నబాబు, పాటలు : రామ జోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్, అడిషనల్ డైలాగ్స్ : ప్రవీణ్, శృతిక్, ఫైట్స్ : విజయ్, డ్రాగన్, ప్రకాష్, ఎడిటింగ్ : కార్తీక శ్రీనివాస్, ఆర్ట్ : నాగేంద్ర, డాన్స్ : బృంద, గణేష్ స్వామి, అడిషనల్ స్క్రీన్ ప్లే : విక్రమ్ రాజ్, కో-డైరెక్టర్ : గంగాధర్ వర్దినీడి, కాస్ట్యూమ్స్ : పి.శేఖర్ బాబు, ఎస్.కె.ఫిరోజ్, మేకప్, గడ్డం శివ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఎన్. సాయిబాబు, నిర్మాత : అక్కినేని నాగార్జున, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : వీరభద్రం.


Click it and Unblock the Notifications
