For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నిజమే...'భాయ్‌' ఫలితం సంతృప్తినివ్వలేదు

  By Srikanya
  |

  హైదరాబాద్: 'భాయ్‌' ఫలితం నిజం చెప్పాలంటే పూర్తిస్థాయిలో సంతృప్తినివ్వలేదు. ఎక్కడో చిన్న లోటు. మిశ్రమ స్పందన వచ్చింది. అయినా దాన్ని ధైర్యంగానే స్వీకరించా అంటున్నాడు దర్శకుడు వీరభధ్రమ్. వినోదాన్ని నమ్ముకొన్న దర్శకుల్లో వీరభద్రమ్‌ ఒకరు. కథ ఎలాంటిదైనా అందులో స్వచ్ఛమైన వినోదాన్ని జోడించాల్సిందే అనేది ఆయన నమ్మిన సిద్ధాంతం. 'అహనా పెళ్లంట' సినిమా నుంచీ ఆయన అదే దారిలో నడుస్తున్నారు. 'పూలరంగడు'తో ద్వితియ విఘ్నం లేకుండా చేసుకొన్నారు. ఇప్పుడు నాగార్జునను 'భాయ్‌'గా చూపించారు. అయితే చిత్రం అనుకున్నట్లుగా ఆడలేదు. ఈ విషయమై మీడియాతో మాట్లాడారు.

  సినిమా ప్రేక్షకులకు పట్టకపోవటానికి కారణం విశ్లేషిస్తూ...నా నుంచి ప్రేక్షకులు వినోదం కోరుకొంటారు. ఎందుకంటే 'అహనా పెళ్లంట', 'పూలరంగడు' సినిమాలు పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రాలు. 'భాయ్‌'లోనూ ఆ స్థాయి ఆశించారు. అయితే కథ ఏం చెబితే అది చేయడం వల్ల... ప్రథమార్థంలో వినోదపు పాళ్లు తగ్గాయి. కానీ ద్వితీయార్థంలో మాత్రం ఆ లోటు రానివ్వలేదు. సినిమాని నిలబెట్టింది అదే. సినిమాలో ఎంతో కొంత విషయం లేకపోతే ఇన్ని వసూళ్లు రావు కదా.. అన్నారు.

  అలాగే మాఫియా కథని చూసీ చూసీ జనం విసిగిపోయారంటారనేది నిజం కాదు. కథ, కథనాల్లో కొత్తదనం ఉంటే... ఎలాంటి నేపథ్యాన్ని అయినా ఎంచుకోవచ్చు. ప్రేమకథలు ఇన్ని వస్తున్నాయంటే కారణం ఏమిటి? అది ఎవర్‌ గ్రీన్‌. మాఫియా సినిమాలూ అంతే. స్త్టెలిష్‌ యాక్షన్‌ పండించడానికి ఇదో దారి. వినోదం కోసం కామెడీ ట్రాకులు పెట్టకూడదు. అది కథలో, కథానాయకుడి బాడీ లాంగ్వేజ్‌లో ఉండాలి అని చెప్పారు వీరభద్రమ్. నాగార్జునలాంటి స్టార్ హీరోతో చేయడం వల్ల దర్శకుడిగా తనకు కలిగిన ప్రయోజం చెప్తూ... స్టార్‌ హీరోతో చేస్తే ఓ మెట్టు పైకి ఎక్కినట్టే. అంతకు ముందు రెండు సినిమాలు చేశా. అవి విజయవతం అయ్యాయి. వాటికి దక్కిన గుర్తింపు 'భాయ్‌'. నాగార్జునలాంటి హీరో నన్ను పిలిచి అవకాశం ఇవ్వడం అంటే... మాటలు కాదు కదా? అని వివరించారు.

  దర్శకుడిగా నేను నమ్మే సిద్దాంతం... ప్రేక్షకులకు కావల్సిన వినోదం అందివ్వడమే. ఈ రోజుల్లో అదే బ్రహ్మాస్త్రం. ప్రేక్షకులే కాదు, అగ్రకథానాయకులూ వినోదాన్నే కోరుకొంటున్నారు. నిర్మాతలకూ అలాంటి కథలే కావాలి. 'అత్తారింటికి దారేది' సినిమా అంత పెద్ద విజయం సాధించిందంటే కారణం ఏమిటి? అందులో ఉన్నది వినోదమే. నేనూ అదే దారిలో ఉండడంతో నాకు అవకాశాలొస్తున్నాయి. అంతేకాదు... నన్ను నమ్ముకొన్న నిర్మాతలకు నష్టాలు రాకూడదు. దాని కోసం ఎంత కష్టమైనా పడతా. చేసే పనిని సీరియస్‌గా తీసుకోవడం నాకిష్టం. తెరపై వినోదాన్ని పండించినా, సెట్‌లో మాత్రం చాలా సీరియస్‌గానే ఉంటా. ఎందుకంటే పని విషయంలో రాజీ పడకూడదు.

  తరవాతి ప్రాజెక్టుల గురించి చెప్తూ...నెక్ట్స్ సినిమా గోపీచంద్‌తో ఉంటుంది. ఇప్పటికే కథ సిద్ధమైంది. భవ్య ఆర్ట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందిస్తాం. గోపీచంద్‌కి యాక్షన్‌ ఇమేజ్‌ ఉంది. ఆ పరిధిలో ఉంటూనే... వినోదం జోడిస్తూ కథ రాసుకొన్నా. సరికొత్త గోపీచంద్‌ని తెరపై చూపించే సినిమా ఇది.కథ ఎలాంటిదైనా అందులో వినోదం జోడించాల్సిందే. ఈతరం ప్రేక్షకులు సినిమాని జాలీగా చూడాలనుకొంటున్నారు. సినిమాని చూసేవాళ్లలో యువతరమే ఎక్కువ. అందుకే వారిని దృష్టిలో ఉంచుకొనే కథలు సిద్ధం చేసుకోవాలి అన్నారు.

  English summary
  Akkineni Nagarjuna's much-talked-about Telugu movie Bhai has soared up the viewers' expectations to the sky high prior its release. But the Veerabhadram-directed movie, which has hit the screens on October 25, has garnered negative reviews from film critics across the globe. The critics feel that instead of focusing on good story and screenplay, the director has given more importance to Nagarjuna's heroism.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X