మా పాఠకుల ప్రశ్నలకు 'పూల రంగడు' డైరెక్టర్ జవాబులు

By Srikanya

తెలుగులో రెండో సినిమా అంటే టెన్షన్. ఆ విఘ్నం దాటితే చాలా గొప్ప విషయం అన్నట్లుగా ఇండస్ట్రీ భావిస్తూంటుంది. ఆ ద్వితీయ విఘ్నాన్ని అద్వితీయంగా దాటిన దర్శుకుడు వీరభద్రం. అప్పటికే అప్పలరాజు ప్లాప్ లో ఉన్న సునీల్ తో సూపర్ హిట్ ఇచ్చి ఇండస్ట్రీని ఆశ్చర్యపరిచారు. ఆయనతో వన్ ఇండియా తెలుగు ముచ్చటించింది. బిజీగా ఉండి కూడా ..మా పాఠకులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చి సహకరించారు. ఆ ప్రశ్నలు..జవాబులు

ప్రశ్న:సినిమా రిలీజైన మరుసటి రోజే,మీకూ సునీల్ కీ మధ్య విభేదాలు వచ్చాయని వార్తలు వచ్చాయి

వీరభద్రమ్:(నవ్వుతూ)విభేధాలు వస్తే ఆ సాయింత్రం ఇద్దరం కలిసి టీవీ ఛానెల్ కి వెళ్లి లైవ్ లో ఎలా కూర్చుంటాం..సక్సెస్ మీట్ కి ఇద్దరం ఎలా కలిసి వస్తాం...

ప్రశ్న:సునీల్ ఆల్రెడీ అప్పలరాజు సినిమాతో ప్లాప్ లో ఉన్నాడు. ఆల్రెడీ అహనా పెళ్లంట సినిమాతో హిట్టులో ఉన్న మీరు ఆయనతో చేయటం రిస్క్ అనిపించలేదూ
(టి.సుబ్రమణ్యం)

వీరభద్రమ్:ప్లాప్,హిట్టు అనే వాటితో ఆర్టిస్టులను నేను అంచనా వేయటానికి ఇష్టపడను. సునీల్ చాలా కసితో ఈ సినిమాకు పనిచేసాడు.

ప్రశ్న: పూలరంగడు ఇంత హిట్ సాధించటానికి కారణం ఏమిటి
(ఎస్ .రాజ్య లక్ష్మి)

వీరభద్రమ్: ఫ్యామిలీలకు నచ్చటం..ముఖ్యంగా నేను పల్లెనుంచి వచ్చాను. నాకు అక్కడ భూమిని నమ్ముకున్న రైతుల కథలు తెలుసు. అదే ఈ సినిమాలో హిరో ఒక చోట తను నమ్ముకున్న స్ధలం మధ్యలో కూర్చుని ..బాధపడటం కన్నీళ్లు తెప్పిస్తుంది..ఆ సీన్ పండుతుంది..సినిమా ఎక్కడికో వెళ్తుందనుకున్నాను..అదే జరిగింది.

ప్రశ్న: మీ మీద ఏ దర్శకుల ప్రభావం ఉంది
(కె.రాజేష్)

వీరభద్రమ్:నాకు తెలుగులో ఇవివి సత్యనారాయణగారూ, జంధ్యాల, తమిళంలో శంకర్,మణిరత్నం,మళయాళంలో ఫాజిల్ అంటే విపరీతమైన ఇష్టం. వారి ప్రభావం నాపై ఖచ్చితంగా ఉంటుంది. అలాగే నాకు బాగా నచ్చిన చిత్రం మణిరత్నం మౌనరాగం. ఆ సినిమా క్లైమాక్స్ ఎన్ని సార్లు చూసానో లెక్కలేదు.

ప్రశ్న:పూలరంగడు సినిమా సునీల్ గారి తో నే ఎందుకు తీయలనుకున్నారు ?మరే కామెడీ హీరో తో అయిన చేయొచ్చు కదా ?
(ఆర్.సంధ్య)

వీరభద్రమ్:సునీల్ లో ఉన్న కామెడీ టింజ్,మొహంలో కనపడే అమాయికత్వం ఈ కథకు సరిపోతాయి..వేరే హీరోలు ఈ కథకు సూట్ కారు.

ప్రశ్న:ఎందుకు సార్, నాగేశ్వర రావు సినిమా పేరు(పూలరంగడు)సునీల్ సినిమాకి పెట్టారు?
(బి.సుజాత)

వీరభద్రమ్:నిజానికి ఈ సినిమాకు రకరకాల టైటిల్స్ అనుకున్నాం. సునీల్,అచ్చి రెడ్డి గారు కూడా మంచి టైటిల్స్ చెప్పారు. కానీ కథకు అనుసరించి పూల రంగడు టైటిల్ పెడితే బావుంటుంది అనిపించింది. పూల రంగడు అనే టైటిల్ పెట్టడానికి కారణం..మా వూరు(పశ్చిమ గోదావరి కలవలపల్లి)లో అలాంటి వాళ్ళను చాలా మందిని చిన్నప్పటినుంచీ చూసి ఉండటమే. టెన్త్ లేదా ఇంటరో ఫెయిలై గాలికి తిరుగుతూ లైఫ్ ని ఎంజాయి చేస్తూంటారు...ఏదన్నా సమస్య వచ్చేదాకా వాళ్ళకి తిరుగు ఉండదు..మా సినిమాలో హీరో కూడా అంతే..అందుకే యాప్ట్ అవుతుందని పెట్టాం.

ప్రశ్న: మీ తర్వాత సినిమా నాగార్జున తో అంటున్నారు ... దానికి "దసరా బుల్లోడు" అని టైటిల్ పెడుతున్నారా ?
మీకు పాత సినిమా (టైటిళ్ళు )లు కలిసివస్తున్నాయి కదా ?
(కె.నాని)

వీరభద్రమ్:ఆలాంటిదేం సెంటిమెంట్ ఏమీ లేదండి...కథకు యాప్ట్ అవుతుందనే ఆ రెండు టైటిల్స్ పెట్టడం జరుగుతుంది. నిజంగా నేను తర్వాత చేయబోయే సినిమా కథకు "దసరా బుల్లోడు"టైటిల్ సరిపోతుందనుకుంటే తప్పకుండా పెడతాను.


ప్రశ్న:ఆల్రెడీ సిక్స్ ప్యాక్ సునీల్ కి మీ స్టొరీ రెడీ చేసారా లేక మీ స్టొరీ కోసం సిక్స్ ప్యాక్ చేసాడా ?
(కిరణ్ గుండు)

వీరభద్రమ్:'అప్పల్రాజు' తర్వాత సునీల్‌ సిక్స్‌ప్యాక్‌ చేస్తున్నాడు. కథకు దానికి సంబంధంలేదు. కానీ తన సిక్స్‌ప్యాక్‌ కూడా సినిమాలో ఉండేలా చూడమని చెప్పాడు. రెండురోజులు సమయం తీసుకుని చెబుతానన్నాను. విడిగా కథకు సంభందం లేకుండా సిక్స్ ప్యాక్ చూపితే బాగోదు. దాంతో కథకంటే క్లైమాక్స్‌కు ఎక్కువగా ఆలోచించాను. అక్కడే సిక్స్ ప్యాక్‌ చూపిస్తే రక్తికడుతుందనిపించింది. ఆ పదిహేను నిముషాలు ప్రేక్షకుడికి టెన్షన్‌ కల్గించాలి. అది సక్సెస్‌ అయితే సినిమా హిట్టే. సరిగ్గా నేను అనుకున్నట్లు సిక్స్ ప్యాక్‌ అప్పుడు రివిల్ అయ్యాక థియేటర్లో క్లాప్స్‌ పడటం ఆనందం కలిగించింది.

ప్రశ్న: ఈ సినిమా చూస్తుంటే మళయాళ చిత్రం 'పండిప్పడ' గుర్తు వచ్చింది

(కృష్ణ వర్మ)

వీరభద్రమ్: ఆ సినిమాలో కేవలం సెంట్రల్ పాయింట్ ని మాత్రమే తీసుకుని మేం ఎయిటీ పర్శంట్ డవలప్ చేసాం. రైట్స్ తీసుకుని మూల కథ అని ఆ రైటర్ పేరు వేసాం. ఆ సినిమా అక్కడ పెద్దగా ఆడలేదు. మా సినిమా రిలీజయ్యాక మళయాళంలో కూడా రైట్స్ కోసం అడుగుతున్నారు.

ప్రశ్న:రీమేక్ రైట్స్ కు పూలరంగడు అడుగుతున్నారా కంగ్రాట్స్

వీరభద్రమ్:తమిళ డైరక్టర్ లింగు సామి గారు ఈ సినిమాని తమిళంలో చేస్తానన్నారు. ఆయన పందెం కోడి సినిమాకన్నా బాగా తీసానని మెచ్చుకున్నారు. అలాగే హిందీలో కూడా రైట్స్ అడుగుతున్నారు. నిర్మాతలు డీల్ చేస్తున్నారు.

ప్రశ్న:పూల రంగడు టైటిల్ జస్టిఫికేషన్ ఉందా?

(సంతోష్ కుమార్ శర్మ గొల్లపల్లి)

వీరభద్రమ్:ప్రతీ పల్లెలోనూ పూల రంగడులాంటి కుర్రాళ్లు కనపడుతూనే ఉంటారు. కథ ప్రకారం హీరో భాధ్యతలు లేకుండా పూల రంగడులా తిరుగుతూంటాడు. అతనికో సమస్య వస్తుంది. దాన్నుంచి ఎలా బయిటపడ్డాడని ఉంటుంది. మొత్తం పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. కాబట్టి పల్లెటూళ్లో ఇలా గాలికి తిరిగే వాళ్లను ఆడికేటిరా పూల రంగడు అంటారు. అందుకే ఆ టైటిల్ పెట్టాను.

ప్రశ్న:పూలరంగడు పేరు పెట్టుకున్నందుకు ఎక్ష్పెక్టేషన్స్ ఎక్కువే ఉండి ఉంటాయి... ఆ పేరు నిలబెట్టడానికి ఎటువంటి జాగ్రత్తలు తిసుకున్నారు..?

(చంద్రకళ)

వీరభద్రమ్: సినిమా చూస్తే మీకు...నేను తీసుకున్న జాగ్రత్తలు అర్దమవుతాయి..

ప్రశ్న:పూల రంగడు అనేది ఆల్రెడీ ప్రూవెడ్ టైటిల్...ఏ ధైర్యంతో మీరు ఆ టైటిల్ పెట్టారు

(ఆర్.సుబ్బరాజు)

వీరభద్రమ్: అహనా పెళ్లంట సమయంలోనూ ఆ టైటిల్ పెట్టొద్దని చాలా మంది చెప్పారు. కానీ వినలేదు. నేను నమ్మిన గట్స్ ఈ రోజు ఈ స్ధితికి తీసుకు వచ్చాయి. టైటిల్ పెట్టడంలో ఏమీ భయపడలేదు.

ప్రశ్న: మీలాగే దర్శకులు అవుదామనుకునే ఔత్సాహికులకు సూచనలు

వీరభద్రమ్:తాము ఇష్టపడే దర్శకుడు వద్ద అసెస్టెంట్ గా చేరి నేర్చుకోవటం. పూర్తిగా నేర్చుకున్నాకే సినిమా డైరక్షన్ వైపు వెళ్లటం. ఎందుకంటే డ్రైవింగ్ పుస్తకాల్లో చదివి ప్రాక్టికల్స్ లేకుండా కారు నడిపితే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంది. కష్టే ఫలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X