వీరభద్రుడు క్లెయిమాక్స్ రీషూటింగ్
బాలకృష్ణ వీరభద్రుడు సినిమా క్లెయిమాక్స్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. క్లెయిమాక్స్ ఫైట్‌ను పీటర్ హైన్స్ ఇటీవల చిత్రీకరించారు. అయితే ఆ సన్నివేశాలు తీవ్ర హింసాత్మకంగా ఉండడంతో సెన్సార్ అభ్యంతాలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ సన్నివేశాలను రీ షూట్ చేయడానికి పీటర్ హైన్స్ డేట్స్ అందుబాటులో లేవు. ఆయన ప్రస్తుతం రజనీకాంత్ శివాజీ సినిమాలో బిజీగా ఉన్నారు. అందువల్ల టాగూర్, ఒక్కడు సినిమాలకు పనిచేసిన విజయన్ పిలించి రీ షూట్ చేస్తున్నారు. దీనితో ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్ధితి ఏర్పడింది. ఏప్రిల్ నెలాఖరులో గానీ మే మొదటి వారంలో కానీ సినిమా విడుదల అయ్యే అవకాశముంది.


Click it and Unblock the Notifications