‘వీరప్పన్’ మూవీ కలెక్షన్స్ సంగతేంటి?
హైదరాబాద్: స్మగ్లర్ వీరప్పన్ జీవితం ఆధారంగా అర్జున్; కిషోర్, రవి కాలె ప్రధాన పాత్రధారులుగా ఎ.ఎల్.ఆర్.రమేష్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం వీరప్పన్. శ్రీజె.వి ప్రొడక్షన్స్ పతాకంపై అక్షయ క్రియేషన్స్ సమర్పణలో యం.వెంకట్రావ్, ఎ.ఎం.ఆర్.రమేష్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేసారు.
ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తోందని నిర్మాత తెలిపారు. వెంకట్రావ్ మాట్లాడుతూ...'వీరప్పన్ నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించడం జరిగింది. అర్జున్ పోలీసాఫీసర్ పాత్రలో అద్భుతంగా నటించారు.

వీరప్పన్ పాత్రలో నటుడు కిషోర్ జీవించాడు. మొత్తం 200 థియేటర్లలో సినిమాను రిలీజ్ చేసాం. రెండో వారంలో మరో వంద థియేటర్లు పెంచాం. మొదటి వారికి రూ. 1 కోటి గ్రాస్ వసూలైంది. బి, సి సెంటర్ల ఆడియన్స్ నుంచి చిత్రానికి మంచి స్పందన వస్తోంది. ఈ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు' అనితెలిపారు.
ఈ చిత్రంలో లక్ష్మీరాయ్ జర్నలిస్టు పాత్రలో నటించింది. అయితే ఆమె పాత్ర కనిపించేది కొంత సేపే. ఒక రకంగా చెప్పాలంటే ఆమె పాత్ర నటనకు ప్రాధాన్యంలేని చిన్న పాత్ర. సినిమా మొత్తాన్ని వీరప్పన్ పాత్ర పోషించిన కిషోర్, పోలీస్ ఆఫీసర్ పాత్ర పోషించిన అర్జున్ తమ భుజాల మీదన వేసుకుని నడిపించారు.


Click it and Unblock the Notifications











