twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ సినిమాపై... స్మగ్లర్ వీరప్పన్ భార్య ఆందోళన

    By Bojja Kumar
    |

    చాలా ఏళ్ల పాటు మూడు రాష్ట్రాల పోలీసులకు కంటిమీద కునుకులేకుండా చేసిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ ఆ మధ్య ఎన్ కౌంటర్లో మరణించని విషయం తెలిసిందే. వీరప్పన్ జీవిత చరిత్రపై తమిళంలో ఓ సినిమా రూపొందుతోంది. 'వానాయుధమ్' అనే టైటిల్ తో రూపొందుతోన్న ఈ చిత్రానికి ఎఎంఆర్ రహమాన్ దర్వకత్వం వహించారు.

    అయితే ఈ చిత్రంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి చెన్నయ్‌లో ఆందోళనకు దిగారు. ఈ సినిమాలో తన భర్త గురించి, మా ఫ్యామిలీ గురించి అవాస్తవాలను చూపించారని, ఆ చిత్రం విడుదల కాకుండా నిషేదం విధించాలని డిమాండ్ చేస్తోంది.

    ముత్తు లక్ష్మి ఆందోళనకు అసలు కారణం....వీరప్పన్ భార్యగా, గతంలో పలు కేసుల్లో సంబంధం ఉన్న ముత్తు‌లక్ష్మి ఆరేళ్లు పోలీసు కస్టడీలో ఉండటంతో పాటు, మూడేళ్లు కర్నాటక జైలులో శిక్ష అనుభవించింది. ఇప్పటికీ ఆమెపై పలు కేసులు పెండింగులో ఉన్నాయి. అయితే ఈ సినిమాలో తన భర్త పాత్రను, తన పాత్రను పోలిన క్యారెక్టర్లను వాస్తవానికంటే క్రూరంగా చూపించారని ముత్తు లక్ష్మి ఆరోపిస్తోంది.

    English summary
    Slain forest brigand Veerappan's wife Muthulakshmi on Wednesday sought a ban on a movie 'Vanayudham' saying it portrays her husband and the family in poor light.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X